బావా- బావమరుదుల సూచనలు – హాస్పిటల్స్ వివరాలు..

కరోనా ఎఫెక్ట్ - మహేష్ బాబు, సుధీర్ బాబు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు..

  • Publish Date - March 17, 2020 / 09:08 AM IST

కరోనా ఎఫెక్ట్ – మహేష్ బాబు, సుధీర్ బాబు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు, అతని బావ సుధీర్ బాబు కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపడుతోంది. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మంచు మనోజ్ తదితరులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తాజాగా మహేష్ బాబు కరోనా గురించి ట్వీట్ చేశారు.

‘‘కోవిడ్‌ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది నిజంగా కష్ట కాలమే.. అయినప్పటికీ మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలైనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’’ అని పేర్కొన్నారు. సుధీర్ బాబు హైదరాబాద్‌లో ‘ఐసోలేషన్’ ఫెసిలిటీస్ గల ప్రైవేట్ హాస్పిటల్స్ వివరాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Read Also : కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యలపై సుమ వీడియో.

ట్రెండింగ్ వార్తలు