×
Ad

Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..

శనివారం (జనవరి 22) సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..

  • Published On : January 22, 2022 / 05:10 PM IST

Mahesh Namrata

Mahesh-Namrata: సూపర్‌స్టార్ మహేష్ బాబుకి ఫ్యామిలీ.. షూటింగ్.. ఈ రెండే ప్రపంచం.. షూటింగ్ గ్యాప్ దొరికితేనో లేక తాను గ్యాప్ తీసుకునో ఏడాదికి కనీసం ఒకటి, రెండు సార్లైనా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు మహేష్. కోవిడ్ వల్ల కొద్దికాలంగా ట్రిప్స్‌కి గ్యాప్ వచ్చింది.

AAGMC Teaser : యాక్టర్‌గా నటించడానికి డాక్టర్ పెట్టిన కండీషన్ ఏంటి?

ఇటీవల మహేష్ బాబు కోవిడ్ బారినపడ్డారు. కొద్ది రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తర్వాత ఇటీవలే కోలుకున్నారు. అన్న రమేష్ బాబు మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఘట్టమనేని కుటుంబం. నేడు (జనవరి 22) రమేష్ బాబు పెద్దకర్మ సందర్భంగా కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చారు మహేష్.

Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!

ఇదిలా ఉంటే శనివారం మహేష్ భార్య నమ్రత 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే NSG (నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని) యు ఆర్ మై రాక్.. థ్యాంక్యూ ఫర్ షేరింగ్ మై వరల్డ్ విత్ మి’ అంటూ మహేష్ తన భార్యకి ప్రేమపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.