jayakrishna
Jayakrishna : మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా శ్రీనివాస మంగాపురం అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి జయకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.(Jayakrishna)
దీంతో జయకృష్ణ ఎప్పుడు మీడియా ముందుకు, ఫ్యాన్స్ ముందుకు వచ్చి మాట్లాడతాడు అని ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా కంటే ముందే జయకృష్ణ తన మొదటి స్పీచ్ ఇచ్చాడు. నేడు విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఈవెంట్ కి జయకృష్ణ కూడా హాజరయ్యాడు.
విగ్రహావిష్కరణ అనంతరం జయకృష్ణ మాట్లాడుతూ.. నేను ఏం చేసినా కృష్ణ గారు నా పక్కన ఉండి నడిపిస్తారు అనుకుంటాను. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నా లైఫ్ గోల్ ఆయన గర్వపడేలా ఉండాలి. నేను ఇప్పటిదాకా ఏం చేయకపోయినా మీరంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు. బాబాయ్ మహేష్ బాబు నాకు ఎప్పుడూ గైడెన్స్ ఇస్తారు. ఆయనకు నేను వీరాభిమాని. చిన్నప్పట్నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ ఆయన రిలీజ్ చేసారు. అందుకు నాకు గర్వంగా అంది. థ్యాంక్యూ బాబాయ్. ఫ్యాన్స్ అంతా గర్వపడేలా చేస్తాను అని అన్నాడు. దీంతో ఘట్టమనేని నూతన వారసుడు జయకృష్ణ మొదటి స్పీచ్ వైరల్ గా మారింది.
Also Read : Rajasaab : ఇంత మంచి ఫైట్ సీన్ సినిమాలో పెట్టకుండా.. రాజాసాబ్ కొత్త ప్రోమో రిలీజ్.. పాపం ఫ్యాన్స్..