Meenaakshi Chaudhary : ఆ డైరెక్టర్ వల్ల షూటింగ్ మొదటి రోజే ఏడ్చాను.. సినిమాలు మానేద్దాం అనుకున్నా.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్..
ఈ క్రమంలో తను సినిమాల్లో బాగా ఫీల్ అయిన ఓ విషయం చెప్పుకొచ్చింది. (Meenaakshi Chaudhary)
Meenaakshi Chaudhary
- అనగనగా ఒక రాజు ప్రమోషన్స్
- మీనాక్షి చౌదరి కామెంట్స్
- సినిమాలు మానేద్దాం అనుకుంది
Meenaakshi Chaudhary : తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి ఒకరు. మీనాక్షి బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి తన సినిమాలతో సందడి చేస్తుంది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమా, 2025 సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్స్ కొట్టిన మీనాక్షి 2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో రానుంది.(Meenaakshi Chaudhary)
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడింది మీనాక్షి. ఈ మీడియా మీట్ లో సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తను సినిమాల్లో బాగా ఫీల్ అయిన ఓ విషయం చెప్పుకొచ్చింది.
Also Read : Rajasaab : ఇంత మంచి ఫైట్ సీన్ సినిమాలో పెట్టకుండా.. రాజాసాబ్ కొత్త ప్రోమో రిలీజ్.. పాపం ఫ్యాన్స్..
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నా మొదటి సిరీస్ హిందీలో అవుట్ ఆఫ్ లవ్ చేశాను. ఆ సిరీస్ డైరెక్టర్ తిగ్మన్షు ధూళియ చాలా స్ట్రిక్ట్. ఆయన అప్పటికే సీనియర్ డైరెక్టర్. నాకు అదే ఫస్ట్ సిరీస్. అప్పటికి సినిమాలు కూడా ఏమి చేయలేదు. మొదటి రోజు షూటింగ్ లోనే డైరెక్టర్ తిట్టారు. నా వల్ల కాలేదు. ఏడ్చేసాను. నేను సినిమాలు మానేద్దాం అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. నా మేనేజర్ కి ఫోన్ చేసి నేను ఆ సిరీస్ చేయను బయటకు వచ్చేస్తాను అని చెప్పాను. కానీ కాంట్రాక్ట్ రాశాము అని చెప్పడంతో చేశాను. అప్పుడు నుంచి కష్టపడ్డాను కాబట్టే ఇవాళ ఈ స్టేజిలో ఉన్నాను అని తెలిపింది.
