Mahesh Babu : కొత్త కారు కొన్న మహేష్ బాబు.. దాని ధర ఎంతో తెలుసా..?

ఖరీదైన కొత్త కారుని కొనుగోలు చేసిన మహేష్ బాబు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Mahesh Babu buy new Range Rover SV 2023 car with 5.5 crores

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడు గానే కాదు బ్రాండ్ అంబాసడర్‌గా మరియు పలు బిజినెస్ లతో ఎన్నో కోట్లు ఆర్జిస్తుంటాడు. నటుడిగా కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. ఇక తన రేంజ్ కి తగ్గట్టే మహేష్.. ఖరీదైన కార్లు వాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే తన గ్యారేజీలో పలు విలువైన కార్లు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరో కొత్త కారుని కొనుకోగలు చేశాడు. ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన రేంజ్ రోవర్ ఎస్వీ (Range Rover SV 2023) మహేష్ కొన్నాడు.

Amitabh – Kamal : కమల్‌తో ప్రాజెక్ట్ K లో కలిసి పనిచేయడం పై అమితాబ్ ట్వీట్.. అంతకుముందు వీరిద్దరూ చేసిన సినిమా తెలుసా?

మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ నిన్న జూన్ 24 స్టార్ట్ అయ్యింది. ఇక ఈ మూవీ షూటింగ్ మహేష్ ఈ కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ లో ఉన్న ఆ ఫోటోని చూసిన నెటిజెన్లు.. ఆ కారు ఎంత ఉంటదని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో రేంజ్ రోవర్ ఎస్వీ కారు ధర ఐదున్నర కోట్లకు పైగానే ఉంది. ఇక ఆ కారు విలువ 5 కోట్లు పైనే అని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Prabhas : నా డ్రీమ్ నెరవేరబోతోంది.. ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్‌తో నటించడంపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..

ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. ఈ మూవీ మొదలైన దగ్గర నుంచి ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ పెండింగ్స్ వల్ల విడుదల పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. ఈ షూటింగ్స్ లేటు అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే కూడా బయటకి వచ్చేసింది. ఆల్రెడీ ఆమె పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇప్పుడు ఆమె వెళ్లిపోవడంతో మళ్ళీ రీ షూట్ చేయాల్సి ఉంది. అయితే ఏదేమైనా ఈ సినిమాని చెప్పినట్లు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలబెడతామని చెబుతున్నారు మేకర్స్.

 

ట్రెండింగ్ వార్తలు