Mahesh Babu : రాజమౌళి సినిమా షూటింగ్ ఉంది.. ఈడీ విచారణకు రాలేను.. మహేష్ బాబు లేఖ..

మహేష్ బాబు తీసుకున్న డబ్బుల వ్యవహారంపై ఈడీ నోటీసులు జారీ చేసి ఏప్రిల్‌ 28న విచారణకు రావాలని ఆదేశించింది.

Mahesh Babu cant Attend to ED Enquiry due to Rajamouli movie shoot

Mahesh Babu : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. సాయిసూర్య డెవలపర్స్‌, సురానా ప్రాజెక్టు కేసుల్లో టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్స్ లో మహేష్ బాబు పాల్గొన్నాడు, యాడ్స్ చేసాడు. ఇందుకు మహేష్ 3.9 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో, రెండు కోట్ల రూపాయలను క్యాష్ రూపంలో తీసుకున్నారు.

మహేష్ బాబు తీసుకున్న డబ్బుల వ్యవహారంపై ఈడీ నోటీసులు జారీ చేసి ఏప్రిల్‌ 28న విచారణకు రావాలని ఆదేశించింది. రేపు మహేష్ బాబు ఈడీ విచారణకు వెళ్ళాలి. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం.

Also Read : Tollywood Vs Reviews : సినిమాలు హిట్ అయితే ఓకే.. ఫ్లాప్ అయితే రివ్యూల గురించి మాట్లాడాలి.. కొత్త సాకు వెతుక్కున్న టాలీవుడ్..

ఈ మేరకు మహేష్ బాబు ఈడీకి లేఖ రాసారు. ఈడీ అధికారులకు మహేష్ మెయిల్ ద్వారా లేఖను పంపించినట్టు తెలుస్తుంది ఈ లేఖలో.. రేపు విచారణకు హాజరు కాలేను అని, సినిమా షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేను, మరో తేదీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఈడీ ఏమని స్పందిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూట్ పూర్తవ్వగా మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో రేపట్నుంచి జరగనుంది.