Tollywood Vs Reviews : సినిమాలు హిట్ అయితే ఓకే.. ఫ్లాప్ అయితే రివ్యూల గురించి మాట్లాడాలి.. కొత్త సాకు వెతుక్కున్న టాలీవుడ్..
సినిమా కంటెంట్ బాగోక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మొదటగా రివ్యూల మీదే కామెంట్స్ చేస్తున్నారు ఆయా సినిమాల వాళ్ళు.

Tollywood Find New Solution for Escaping Flop Talk Negative Comments on Reviews
Tollywood Vs Reviews : ఇటీవల కొన్ని సినిమా యూనిట్లు, కొంతమంది సినిమా ప్రముఖులు సినిమా రిలీజ్ తర్వాత రివ్యూల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సైట్స్ రివ్యూల మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది అన్నిసార్లు జరగట్లేదు. అన్ని సినిమాలకు జరగట్లేదు. కొన్ని సినిమాలకు మాత్రమే కామెంట్స్ చేస్తున్నారు ఇలా.
ఇటీవల ఏదైనా సినిమా సక్సెస్ అయి, డబ్బులు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంటే ఎవరూ రివ్యూల గురించి మాట్లాడట్లేదు. ఆ హిట్ అయిన సినిమాలకు కూడా కొన్ని రివ్యూలలో నెగిటివ్ పాయింట్స్ రాసారు, కానీ అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. అలాగే చిన్న సినిమాలు అయినా, వేరే భాష సినిమాలు అయినా కంటెంట్ బాగుంటే పొగుడుతూ రివ్యూలు రాసినా ఎవరి గురించి మాట్లాడలేదు. మీరు రివ్యూలు బాగా రాసారు అని అభినందించలేదు. మీ రివ్యూల వల్లే జనాలు థియేటర్స్ కి వస్తున్నారు అని చెప్పలేదు.
కానీ సినిమా కంటెంట్ బాగోక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మొదటగా రివ్యూల మీదే కామెంట్స్ చేస్తున్నారు ఆయా సినిమాల వాళ్ళు. నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు కాబట్టే సినిమా ఫ్లాప్ అయిందని కొత్త సాకు చెప్తున్నారు తప్ప తమ దగ్గర కంటెంట్ లేదని ఒప్పుకోవడం లేదు. సక్సెస్ అయినప్పుడు రివ్యూల వల్ల సినిమాలకు వస్తారు అని చెప్పని వాళ్ళు ఫ్లాప్ అయితే మాత్రం రివ్యూల వల్లే సినిమాకు రావట్లేదని అనడం గమనార్హం.
Also Read : Naga Chaitanya : ఈ యూట్యూబర్ నాగచైతన్యకు అంత క్లోజ్ ఫ్రెండా? ఫ్రెండ్ బాధలో ఉంటే చైతూ..
ఇటీవల ఓ మీడియం రేంజ్ రొటీన్ కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లో ఏదో కొత్తదనం ఉంది అని ప్రచారం చేసి జనాల్ని రప్పించడానికి ట్రై చేసారు. ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూలతో పాటు నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో రివ్యూలకు సంబంధం లేని మాములు నెటిజన్లు సినిమా బాగోలేదు అని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయినా కలెక్షన్స్ రాకపోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ పెట్టి మరీ రివ్యూలు రాసేవాళ్ళ మీద ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు.
తాజాగా ఓ చిన్న సినిమా యూనిట్ అయితే మరీ ఘోరం. సాధారణంగా సినిమాలు మీడియా వాళ్లకు, సెలబ్రిటీలకు ప్రెస్ షోలు, ప్రీమియర్ షోలు రిలీజ్ కి ముందు రోజు రాత్రి లేదా రిలీజ్ రోజు ఉదయమే వేస్తుంటారు. రెండు రోజుల క్రితం రిలీజయిన ఓ చిన్న సినిమా రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ షో వేశారు. అంటే ఆల్రెడీ రిలీజ్ రోజు ఉదయం నుంచి చాలా చోట్ల షోలు పడ్డాయి, కొంతమంది జనాలు చూసారు. ఒకరిద్దరు తప్ప మీడియాలో ఆ సినిమా రివ్యూ ఎవరూ రాయలేదు. ప్రెస్ షో లేట్ గా వేయడంతో రివ్యూ లు రాసేవాళ్ళు కూడా రిలీజయిన రాత్రి లేదా రిలీజయిన నెక్స్ట్ డే రివ్యూలు రాసారు. కానీ మూవీ యూనిట్ నెక్స్ట్ డే గ్రాటిట్యూడ్ మీట్ అని పెట్టి రివ్యూలు నెగిటివ్ గా రాసారు అందుకే జనాలు రాలేదు అని మాట్లాడటంతో మీడియా జనాలు ఆశ్చర్యపోయారు. అసలు రివ్యూలు రాసే ముందే రిలీజయిన అన్ని చోట్ల మూడు షోలు పడి సినిమా టాక్ జనాల్లోకి వెళ్లిన సినిమా కూడా సినిమా హిట్ టాక్ రాకపోవడంతో రివ్యూల మీద కామెంట్స్ చేసారు. దీంతో మరోసారి సినిమా వాళ్ళు దొరికిపోయారు.
Also Read : Deepika Rangaraju : అందర్నీ నవ్వించే సీరియల్ నటి ‘దీపికా రంగరాజు’.. ఆమె మనసులో ఇంత బాధ ఉందా.. ఏంటో తెలుసా?
ఇలా ఒకరు కాదు చాలా మంది ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. సినిమా హిట్ అయితే ఎవరికీ సమస్య ఉండదు. హిట్ అవ్వకపోతే మాత్రం రివ్యూల వల్లే హిట్ అవ్వలేదు లేకపోతే తామేదో బాహుబలి తీసాం అనే ఫీలింగ్ లో ఉంటున్నారు సినిమా వాళ్ళు. అంతే కానీ రియాలిటీకి రావట్లేదు. ఇక రివ్యూలలో ఎక్కువగా వెబ్ సైట్స్ వాళ్లనే విమర్శిస్తున్నారు. ఒక్కో సైట్ లో మహా అయితే ఒక రివ్యూ 50 వేల మంది నుంచి లక్షమందికి రీచ్ అవుతుందేమో. కానీ యూట్యూబ్ లో ఎంతోమంది ఎవరికి వాళ్ళు ఛానల్స్ పెట్టుకొని రివ్యూలు చెప్తున్నారు. వాళ్ళ వీడియోలు ఒక్కోటి ఒక మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. కానీ వాళ్ళని ఏం కామెంట్స్ చెయ్యట్లేదు. ఇక సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు సినిమా చూసాక తమకు ఎలా అనిపించిందో పోస్ట్ చేస్తున్నారు. అమెరికాలో కాస్త ముందే షోలు పడతాయి. అక్కడి జనాలు కూడా సినిమా ఎలా ఉందో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వీళ్లల్లో ఎవరూ నెగిటివ్ గా పెట్టినా ఏమనరు, ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్, నెటిజన్లు. ఆడియన్స్ బాగోలేదు అని చెప్తే తప్పులేదు కానీ రివ్యూలు రాసేవాళ్ళు బాగోలేదు అంటే మాత్రం ఒప్పుకోరు. ఇంకా కొంతమంది అయితే మలయాళం సినిమాలను పొగుడుతారు, తెలుగు సినిమాలను పొగడరు అని స్టేజి మీదే కామెంట్స్ చేస్తారు. మంచి కంటెంట్ సినిమా తీస్తే ఎవరి సినిమా అయినా పొగుడుతారని వాళ్ళు మర్చిపోయారేమో.
Also Read : Sekhar Master : ఏ కొరియోగ్రాఫర్ కి రాని అదృష్టం నాకు వచ్చింది.. చిరంజీవి – చరణ్ సర్స్ తో రెండు సార్లు..
ఇటీవల కోర్ట్ సినిమాలో ఏ స్టార్ హీరో ఉన్నాడని మీడియా వాళ్ళు అంతా సినిమా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఇవేమి వాళ్లకు గుర్తు ఉండవు. అభిమానులకు దూరం అవుతామేమో అని రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు తీసుకుంటూ మిడ్ రేంజ్, స్టార్ హీరోలు గడిపేస్తూ అవి బాగోలేదు అంటే రివ్యూలు రాసేవాళ్లను అనడం కామన్ అయిపొయింది. టికెట్ రేట్లు పెంచడం, నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేయడం జనాల్ని థియేటర్స్ కి దూరం చేస్తుందని అందరికి తెలుసు. దీని గురించి ఎవరూ బహిరంగంగా ఒప్పుకోరు. కానీ జనాలు రాకపోతే రివ్యూలు రాసేవాళ్లను అంటారు.
మొత్తానికి టాలీవుడ్ లో చాలా మందికి సినిమా ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది అని చెప్పడానికి రివ్యూలు అని ఓ కొత్త సాకు బాగా దొరికింది. నాని ఇటీవల అన్నట్టు సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు, దానికి రివ్యూలతో సంబంధం లేదు అనేది టాలీవుడ్ లో చాలా మంది ఎప్పుడు అర్ధం చేసుకుంటారో చూడాలి. నాని దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, నిర్మాతగా కోర్ట్ .. ఇలా అన్ని సినిమాలు బాగా తీసాడు, మంచి కంటెంట్ కాబట్టి హిట్ అయ్యాయి, డబ్బులు వచ్చాయి, రివ్యూలు కూడా బాగా రాసారు. నానికి తన కంటెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి రివ్యూల మీద కామెంట్ చేయలేదు. అంటే సుందరానికి సినిమాకు కూడా డబ్బులు రాకపోతే నాని రివ్యూల మీద నెగిటివ్ కామెంట్స్ చేయలేదు ఎందుకంటే అది ఆడియన్స్ కి ఎందుకు దగ్గరవ్వలేదు అని ఆత్మ విమర్శ చేసుకున్నాడు కాబట్టి. అలాంటి ఆత్మ విమర్శలు మిగిలిన టాలీవుడ్ ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి మరి.