Mahesh Babu Did a Advertisement with Rajamouli Movie Looks Fans Disappointed
Rajamouli – Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. SSMB29గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో లీకులు వస్తున్నాయి. మహేశ్ పూర్తిగా రాజమౌళికి మౌల్డ్ అవ్వాల్సిందేనని, రాజమౌళి చెప్పినట్టు చేయాల్సిందేనని అన్న టాక్స్ వినిపించాయి.
అంతేకాదు మహేశ్‌కు రాజమౌళి కొన్ని కండీషన్లు పెట్టాడని, సినిమా పూర్తయ్యే వరకు తన లుక్ బయటికి రాకుండా చూసుకోవాలని షరతు పెట్టారట. కానీ తీరా చూస్తే ఇప్పటికే మహేశ్ లుక్స్ చాలా సార్లు లీక్ అయ్యాయి. తాజాగా ఓ యాడ్ బయటకు వచ్చింది. అందులో రాజమౌళి సినిమా లుక్‌లోనే కనిపించాడు మహేశ్. దీంతో రాజమౌళి రూల్స్ మహేశ్ దగ్గర వర్కౌట్ కాలేదన్న చర్చ నడుస్తోంది.
Also Read : Shanmukha : ‘షణ్ముఖ’ మూవీ రివ్యూ.. ఆరు ముఖాలు, వికృత రూపంతో పుట్టిన మనిషి..
అయితే రాజమౌళి మారాడట. ఆయన ఛేంజ్ అవడమే కాదు, హీరోలకు తాను పెట్టే రూల్స్ ఇంప్లిమెంటేషన్‌లో సడలింపులు ఇస్తున్నారట. RRR వరకు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా సరే సరెండర్ అవ్వాల్సిందేనని అనేవారు. జక్కన్నతో సినిమా కంప్లీట్ అయ్యేవరకు ఆ సినిమా నుంచి చిన్న లీక్ కూడా రాకుండా జాగ్రత్త పడేవారు. హీరోలు ఏ సినిమా ఒప్పుకునే వారు కాదు. బయట ఎక్కువగా కనపడేవాళ్లు కాదు, యాడ్స్ చేసేవాళ్ళు కాదు.
కానీ మహేశ్‌తో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి లీక్ వస్తూనే ఉంది. మహేశ్ తన కూతురు సితారతో చేసిన యాడ్ ఇప్పుడు రావటంతో రాజమౌళి సినిమాలో లుక్ ఫుల్ వైరల్ అవుతుంది. అయితే జక్కన్న ఇప్పటివరకు ఏ హీరోతో సినిమా చేసినా మూవీ విడుదల వరకు హీరో లుక్ బయటికి రాకుండా కేర్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మహేశ్ లుక్ బయటకు రావటంతో రాజమౌళి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్..
మహేశ్‌తో రాజమౌళి మూవీకి సంబంధించి ప్రతీది ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. ఇక సినిమా రిలీజ్ వరకు ఎన్ని సర్‌ఫ్రైజ్‌లు ఉంటాయోనన్న టాక్ నడుస్తోంది. ఏదైనా SSMB29 విషయంలో రాజమౌళి రూల్స్‌కు బ్రేక్ పడిందంటున్నారు. కొంతమంది రాజమౌళిని మహేష్ లెక్క చేయట్లేదా? లేక మహేష్ ఇవన్నీ ముందే మాట్లాడుకున్నాడా అని సందేహాలు వ్యక్తపరుస్తుంటే ఫ్యాన్స్ మాత్రం ఇలా యాడ్స్ చేసేసి, లుక్స్ లీక్ చేస్తే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి స్ట్రిక్ట్ ఉంటేనే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. కొంతమంది మాత్రం లుక్ అదిరింది అంటూ పండగ చేసుకుంటున్నారు.