Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్..

తాజాగా యూకే ఫ్యాన్స్ మీట్ లో చిరంజీవి ఆ రోజు మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు.

Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్..

Megastar Chiranjeevi reveals what Modi said on Pawan Kalyan Oath Ceremony day

Updated On : March 21, 2025 / 4:29 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యుకె పార్లమెంట్ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో అక్కడి పార్లమెంట్ సభ్యులు, ఇండియా ప్రతినిధులు చిరంజీవికి సన్మానం నిర్వహించారు. అలాగే అదే రోజు బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చింది. అనంతరం గత రెండు రోజులుగా చిరంజీవి యుకెలో ఉంటున్న తెలుగు వారితో, ఫ్యాన్స్ తో మీట్ అవుతున్నారు.

యూకేలో చిరంజీవి ఫ్యాన్స్ మీట్ నిర్వహించగా అక్కడ ఆసక్తికర విషయం మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు స్టేజిపై పవన్ మోదీని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించిన సంగతి అందరికి తెలిసిందే. అప్పుడు ఆ వీడియో, చిరు కళ్ళలో సంతోషం, ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. చిరు – పవన్ – మోదీ ముగ్గురు ఉన్న ఫ్రేమ్ ఫ్యాన్స్ కి, తెలుగు వారికి ఎప్పటికి గుర్తుండిపోయేలా మారింది.

Also Read : Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్..

తాజాగా యూకే ఫ్యాన్స్ మీట్ లో చిరంజీవి ఆ రోజు మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ.. పవన్ ప్రమాణస్వీకారం రోజు మన ప్రధాని మోదీ గారు మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. ఎమ్మెల్యేగా పవన్ గెలిచి నా ఇంటికొచ్చిన వీడియోని ఆయన చూసినట్లు తెలిపారు. తమ్ముడిని ఆహ్వానించి, ఆశీర్వదించిన తీరు ఆయన హృదయాన్ని తాకిందని, అది చూసి కన్నీళ్లు కూడా వచ్చాయని చెప్పారు. అన్నదమ్ములు ఎలా ఉండాలో మీరు చూపించారని ఆయన మెచ్చుకున్నారు అంటూ తెలిపారు. ఈ విషయాన్ని గతంలో ఆల్రెడీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు చిరంజీవి. ఇప్పుడు మరోసారి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Gautam Ghattamaneni : మహేష్ తనయుడి యాక్టింగ్ వీడియో చూశారా? నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడుగా.. వీడియో వైరల్..

దీంతో మెగాస్టార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పవన్ – మోదీ – చిరు ఫ్రేమ్ మాత్రమే కాదు ఇప్పుడు మోదీ మాట్లాడిన మాటలు కూడా ఫ్యాన్స్ ని సంతోషపెడుతున్నాయి. నిజంగానే పవన్ గెలిచి చిరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంబరం చూసి, అన్నదమ్ముల అనుబంధం చూసి ఫ్యాన్స్ అంతా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో కొన్నాళ్ల పాటు వైరల్ అయింది.