Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్..

ఇటీవల చిరంజీవి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్..

Megastar Chiranjeevi Seriously reacts on Money Collecting for Fans Meet

Updated On : March 21, 2025 / 4:09 PM IST

Chiranjeevi : సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఫ్యాన్స్ మీటింగ్స్ పెడతారని తెలిసిందే. ఫ్యాన్స్ మీట్స్ లో ఫ్యాన్స్ ని కలిసి వాళ్లకు ఫోటోలు ఇచ్చి, వాళ్ళతో మాట్లాడి సంతోషపెడతారు. అయితే కొంతమంది తమ హీరోని కలవాలి అనే ఫ్యాన్స్ బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ ఫ్యాన్స్ మీట్స్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పేరుతోనే డబ్బులు వసూలు చేసారు.

ఇటీవల చిరంజీవి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. యుకె పార్లమెంట్ లో చిరంజీవికి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు అందించారు. యుకెలోని భారతీయులను కలిశారు చిరంజీవి. అక్కడి భారతీయులు మెగాస్టార్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పి వారి ప్రేమానురాగాలు చూపించారు. అయితే చిరంజీవి యుకెలో ఫ్యాన్స్ మీట్ పెట్టారని సమాచారం. ఈ ఫ్యాన్స్ మీట్ కి అక్కడ కొంతమంది డబ్బులు వసూలు చేసారని చిరంజీవి దాకా వెళ్ళింది. దీంతో ఈ ఘటనపై మెగాస్టార్ సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందించారు.

Also Read : Gautam Ghattamaneni : మహేష్ తనయుడి యాక్టింగ్ వీడియో చూశారా? నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడుగా.. వీడియో వైరల్..

చిరంజీవి ఈ ఘటనపై స్పందిస్తూ.. నా ఫ్యాన్స్ యుకెలో నన్ను కలవాలని చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఫ్యాన్స్ మీటింగ్ కి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి ఇచ్చేయండి. జాగ్రత్తగా ఉండండి. నేను ఇలాంటి చర్యలకు మద్దతు ఇవ్వనని తెలుసుకోండి. మన మధ్య ప్రేమ, ఆప్యాతల బంధం వెలకట్టలేనిది. దీన్ని ఎవరూ కమర్షియల్ చేయలేరు. మన ఇంటరాక్షన్ జెన్యూన్ గా జరిగేలా చూసుకుందాం అని సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.