Mahesh Babu : అలియా భట్ వెబ్ సిరీస్‌కి.. మహేష్ బాబు ఎమోషనల్ రివ్యూ.. అలా ఎలా చేస్తారంటూ..!

అలియా భట్ వెబ్ సిరీస్‌కి మహేష్ బాబు ఎమోషనల్ రివ్యూ. అలా ఎలా చేస్తారు, అలా చేసే వారిలో హ్యుమానిటీ ఉండదా..?

Mahesh Babu emotional review on Alia Bhatt Poacher web series

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మళ్ళీ ఆయన్ని స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామో అనే క్లారిటీ ఏ ఒక్కరికి లేదు. ఎందుకంటే.. మహేష్ తన తదుపరి సినిమాని రాజమౌళితో చేస్తుండడం. జక్కన్నతో సినిమా అంటే.. అది ఏళ్ళు పట్టేస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే, మహేష్ బాబు రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ ని చూశారట. ఆ సిరీస్ ని చూడడమే కాదు దాని గురించి రివ్యూ ఇస్తూ.. తన ఇన్‌స్టాలో ఓ పోస్టు కూడా వేశారు. ఆ వెబ్ సిరీస్ ఏంటంటే.. మలయాళ ఫారెస్ట్ క్రైమ్ థిల్లర్ ‘పోచర్’. కేరళ అడవుల్లో జరిగిన ఒక నిజమైన కథని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థుల వ్యాపారం చేస్తుంటారు.

Also read : Varun Tej : ఆ సినిమా కోసం లావణ్యతో పెళ్లిని.. రెండుసార్లు వాయిదా వేసుకున్న వరుణ్..

ఇక నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్‌నే.. ఈ సిరీస్ గా రూపొందించారు. ఈ సిరీస్ కి అలియా భట్ ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 23 అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సిరీస్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సిరీస్ ని చూసిన మహేష్ బాబు.. తన రివ్యూని తెలియజేసారు.

“ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో హ్యుమానిటీ ఉండదా..? ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి” అంటూ ఎమోషనల్ అవుతూ రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ రివ్యూ పై అలియా భట్ ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి.