Mahesh Babu : అన్నయ్య అమ్మ ఇప్పుడు నాన్న.. మహేష్ బాబుకే ఎందుకిలా?

ఆంద్రా జేమ్స్‌బాండ్‌ కృష్ణ గారు ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు. రెండు నెలల క్రితం మహేష్ బాబు అమ్మ గారు ఇందిరా దేవి కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటపడి షూటింగ్స్ కి వెళుతున్న మహేష్ బాబు..

Mahesh Babu facing bad year

Mahesh Babu : ఆంద్రా జేమ్స్‌బాండ్‌ కృష్ణ గారు ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో హాస్పిటల్ కి తరలించించారు కుటుంబసభ్యులు. వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. ఈరోజు తెల్లవారుజామున గం.4:09 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు.

Super Star Krishna : కృష్ణ తుదిశ్వాస ప్రశాంతంగా విడిచేందుకు చికిత్స నిలిపివేత.. కుటుంబసభ్యుల నిర్ణయం!

రెండు నెలల క్రితం మహేష్ బాబు అమ్మ గారు ఇందిరా దేవి కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటపడి షూటింగ్స్ కి వెళుతున్న మహేష్ బాబు.. ఇప్పుడు తండ్రిని కూడా కోలుపోవడం చాలా బాధాకరం. అంతేకాదు జనవరిలో మహేష్ అన్న రమేష్ బాబు కూడా మరణించగా, అయన చివరి చూపు కూడా నోచుకోలేకపోయాడు మహేష్ బాబు.

దీంతో ఒకే ఏడాదిలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను కోలుపోవడం మహేష్ కి తీరని లోటు అనే చెప్పాలి. ఏదేమైనా ఈ సంవత్సరం మహేష్ బాబుకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాగా బ్రెయిన్ డ్యామేజ్‌తో ముల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడం వలన ఎన్ని ప్రయత్నాలు చేసిన కృష్ణ గారి శరీరం సహకరించక పోవడంతో.. ఇంటర్నేషనల్ వైద్యం ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అయన తుదిశ్వాస ప్రశాంతంగా విడిచేందుకు చికిత్స నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు డాక్టర్లు మరియు కుటుంబసభ్యులు.