బాయీ దూజ్ పండుగ జరుపుకుంటున్న సితారా

కార్తీక మాసంలో చాలా పండగలు వస్తాయి. అందులో బాయీ దూజ్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకం. ఈ పండుగ కూడా రాఖీ పండుగ లాగానే జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చెల్లెల్లు లేదా అక్కలు తమ అన్నదమ్ములకు హారతి ఇచ్చి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారు.
అయితే గత ఏడాది బాయీ దూజ్ పండుగ సందర్భంగా మహేష్ కూతురు సితార తన అన్నకి హారతి ఇచ్చి మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది కూడా అంతే ఘనంగా బాయీ దూజ్ పండుగ వేడుకలు జరుగుతున్నాయి.
మరి ఈసారి సితారా తన ముద్దుల అన్నకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి మరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.