Mahesh Babu : మహేష్ బాబు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటూ..

మహేష్ బాబు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి తన ట్విట్టర్లో..

Mahesh Babu Gives Venkatesh Sankranthiki Vasthunnam Movie Review

Mahesh Babu : వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకొని అదరగొడుతుంది. ఫ్యామిలీస్ అందరికి వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నచ్చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్, పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తుండగా తాజాగా మహేష్ బాబు కూడా సంక్రాతికి వస్తున్నాం సినిమా చూసి రివ్యూ ఇచ్చారు.

Also Read : Manoj Vs Manchu Family : పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం.. తిరుపతిలో మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ..

మహేష్ బాబు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి తన ట్విట్టర్లో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశాను. ఇది పర్ఫెక్ట్ పండగ సినిమా. వెంకటేష్ సర్ టెర్రఫిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న నా డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూసి గర్వంగా ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ క్యారెక్టర్స్ లో సూపర్ గా నటించారు. బుల్లి రాజు పాత్రలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫుల్ గా నవ్వించాడు. టీమ్ అందరికి అభినందనలు అని తెలిపాడు.

దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మహేష్ బాబు ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. చిన్నోడు పెద్దోడి సినిమాకు రివ్యూ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా హౌస్ ఫుల్ థియేటర్స్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది ఈ సినిమా. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా వెంకటేష్ తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్, వీటీవి గణేష్, ఉపేంద్ర లిమయే, మురళి గౌడ్, సాయి కుమార్.. పలువురు తమ నటనతో నవ్వించారు.

Also Read : Ghaati : అనుష్క ‘ఘాటీ’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలుసా?