Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు.

Mahesh Babu Guntur Kaaram Movie Dum Masala Song Promo Released

Guntur Kaaram : మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ మూడో సారి జత కడుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటీకే పలుమార్లు వాయిదా పడిన గుంటూరు కారం సినిమా సంక్రాతికి జనవరి 12న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసి తీరుతామని నిర్మాత నాగవంశీ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ చేస్తామని చెప్పినా దసరా అయిపోయి దీపావళి కూడా వస్తుండటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. దీంతో చిత్రయూనిట్ ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని నేడు విడుదల చేస్తామని ప్రకటించారు.

Also Read : Payal Ghosh : బాలీవుడ్ నటులు బాలకృష్ణ సర్‌ని చూసి నేర్చుకోవాలి.. హీరోయిన్ ట్వీట్ వైరల్..

తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే పాట రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.