Guntur Kaaram : రమణ గాడి ‘గుంటూరు కారం’ ట్రైలర్ రికార్డ్.. రీజనల్ సినిమాతోనే అదరగొడుతున్న బాబు..

ఇటీవల మన హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు, ట్రైలర్స్ తో రికార్డులు కొడుతుంటే మహేష్ మాత్రం రీజనల్ సినిమాతోనే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నాడు.

Mahesh Babu Guntur Kaaram Trailer New Record in You Tube

Guntur Kaaram Trailer : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం(Guntur Kaaram) ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, మూడు పాటలు, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గుంటూరు కారం ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. మహేష్ మాస్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, అభిమానులకు కావాల్సిన యాక్షన్.. ఇలా అన్ని కలిపి ట్రైలర్ అభిమానులతో పాటు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. ఇటీవల మన హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు, ట్రైలర్స్ తో రికార్డులు కొడుతుంటే మహేష్ మాత్రం రీజనల్ సినిమాతోనే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమా కేవలం తెలుగులోనే రిలీజవుతుంది. ట్రైలర్ కూడా తెలుగులోనే రిలీజ్ చేశారు.

Also Read : ‘ఆస్కార్’ వచ్చిన తర్వాత కీరవాణి మొదటి సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ.. ‘నా సామిరంగ’ ప్రమోషన్స్ లో..

అయితే గుంటూరు కారం సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటల్లోనే 39 మిలియన్స్ వ్యూస్ సాధించి అత్యధిక వ్యూస్ సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ ట్రైలర్ గా రికార్డ్ సెట్ చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఆ వ్యూస్ 40 మిలియన్స్ దాటిపోయాయి. దీంతో మహేష్ అభుమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బాబు రీజనల్ సినిమాతోనే రికార్డులు సెట్ చేస్తుంటే ఇక తర్వాత రాబోయే రాజమౌళి సినిమాతో ఇంకా ఎన్ని రికార్డులు సెట్ చేస్తాడో అని ఊహించుకుంటున్నారు. సంక్రాంతికి థియేటర్స్ లో గుంటూరు కారం ఘాటు గట్టిగానే తగలనుంది.