మహేష్ బాబు లుంగీ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందా 

  • Publish Date - January 11, 2020 / 01:28 PM IST

సినిమాల్లో నటించే వారికి సెంటిమెంట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. సినిమా పేరు, క్యారెక్టర్, ఇతరత్రా విషయాలపై హీరోలు, హీరోయిన్లు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. హీరోల విషయానికి వస్తే..ఏదైనా సినిమాలోని మొదటి అక్షరం కలిసివస్తే..నెక్ట్స్ సినిమాకు అదే అక్షరం వచ్చేలాగా పేరు పెట్టుకొనే విధంగా చేస్తుంటారు. అలాగే..డ్రస్‌ల విషయంలో పక్కాగా ఫాలో అవుతుంటారు.

 

అందులో కీలకమైన డ్రైస్ ‘లుంగీ’. దీనిని ధరించిన వారు సక్సెస్ కొట్టారు కూడా. హీరోలు లుంగీ డ్యాన్సులు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఈ లుంగీ ట్రెండ్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటోంది. యంగ్ హీరోల్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా లుంగీలో కనిపిస్తూ అదరహో అనిపిస్తున్నారు. 
మూడు అక్షరాలతో వచ్చిన టైటిల్స్ ఎక్కువ హిట్ ఇవ్వడంతో అలాంటి వాటికే ఇంపార్టెంట్ ఇస్తుంటాడు ఈ ప్రిన్స్.

ఆయన లుంగీలో కనిపించిన ఫిల్మ్స్ బ్లాక్ బ్లస్టర్స్ హిట్స్‌గా నిలిచాయి. పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలో లుంగీతో కనిపించి…ఫ్యాన్స్‌కు అలరించారు. ఊహించన విధంగా ఈ మూడు సినిమాలు బిగ్గెస్ట్‌గా నిలిచాయి. మహేష్ బాబు పంచెగాని, లుంగీ కాని కట్టుకుని నడిచినా..నిలిబడినా..ఫ్యాన్స్ అరుపులు, కేకలతో థియేటర్స్ దద్దరిల్లుతుంటాయి. 

 

తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా మహేష్ లుంగీతో కనిపించి మెస్మరైజ్ చేశాడు. మైండ్ బ్లాక్ సాంగ్‌తో పాటు చాలా సీన్స్‌లో మహేష్ లుంగీతో రచ్చ చేశాడంట. 2020, జనవరి 11వ తేదీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ అయ్యింది. హిట్ టాక్‌తో దుమ్ము రేపుతోంది. అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో దుమ్ము రేపగా..మహేష్ సరసన రష్మిక మందనా నటించారు. 

Read More :వెస్ట్ బెంగాల్‌లో మోడీ..మమతతో భేటీ..ఏం చర్చించారంటే