Mahesh Babu : పోకిరి, బిజినెస్ మేన్ మాత్రమే కాదు.. ప్రతి సినిమా రీ రిలీజ్..

రీ రిలీజ్ ల ట్రెండ్ మహేష్ బాబు పోకిరితోనే మొదలైంది. అయితే పోకిరి, బిజినెస్ మేన్ మాత్రమే కాదు..

Mahesh Babu movie re releases collections goes to his Foundation

Mahesh Babu : ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ మహేష్ బాబు సినిమాతో మొదలైంది. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఆ రీ రిలీజ్స్ కి కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తుండడం గమనార్హం. అలా రీ రిలీజ్ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ని.. ఆయా హీరోల అభిమానులు సేవా కార్యక్రమాలకు, స్వచ్చంద సంస్థలకు, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రజలకు అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ సినిమా రీ రిలీజ్ కి వచ్చిన కలెక్షన్స్ ని మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇస్తున్నారు.

Mahesh Babu : తలనొప్పి వస్తుండడంతో వాడడం తగ్గించాను.. మా పిల్లలు కూడా.. మహేష్ కామెంట్స్..!

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండె చికిత్సలు మాత్రమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. దీంతో రీ రిలీజ్ కలెక్షన్స్ ని వాటికీ ఉపయోగించేలా మహేష్ బాబు ఫౌండేషన్ కి అందజేస్తూ వస్తున్నారు. పోకిరి, మోసగాళ్లకు మోసగాడు, బిజినెస్ మేన్.. ఇలా ఇప్పటివరకు రిలీజ్ అయిన, రీ రిలీజ్ కాబోయే ప్రతి సినిమా కలెక్షన్స్ అన్ని కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కి వెళ్తాయని మహేష్ తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించాడు.

Guntur Kaaram : గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు.. సంక్రాంతి బరిలో ‘గుంటూరు కారం’..

అలాగే ఇప్పుడు తాను నటిస్తున్న సినిమా వివరాలు కూడా తెలియజేశాడు. రాజమౌళి మూవీ (SSMB29) పనులు ఇంకా మొదలవలేదని, దాని కోసం తానుకూడా ఎటువంటి కసరత్తులు చేయడం లేదని వెల్లడించాడు. ఇక గుంటూరు కారం (Guntur Kaaram) విషయానికి వస్తే.. సంక్రాంతి రిలీజ్ కావడం కష్టం అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీని పై మహేష్ ఒక క్లారిటీ ఇచ్చాడు. 2024 జనవరి 12న రావడం పక్కా అంటూ పేర్కొన్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ పక్కా మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు.