Mahesh Babu : తలనొప్పి వస్తుండడంతో వాడడం తగ్గించాను.. మా పిల్లలు కూడా.. మహేష్ కామెంట్స్..!
ఒక కమర్షియల్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు.. తనకి ఆ విషయం బాగా తలనొప్పి తెప్పిస్తుంది అంటూ పేర్కొన్నాడు.

Guntur Kaaram Mahesh Babu says usage of phone lead to headache
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో కూడా ఆడియన్స్ ని పలకరిస్తుంటాడు. టాలీవుడ్ ఏ స్టార్ హీరో సైన్ చేయనని సంస్థలకు మహేష్ బ్రాండ్ అంబాసడర్ గా సైన్ చేస్తాడు. ఈక్రమంలోనే మహేష్.. ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సి (Big C) కి కూడా బ్రాండ్ అంబాసడర్ వ్యవహరిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ సంస్థ 20 ఇయర్స్ పూర్తీ చేసుకోవడంతో హైదరాబాద్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మహేష్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యాడు.
Guntur Kaaram : గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు.. సంక్రాంతి బరిలో ‘గుంటూరు కారం’..
ఇక ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. “మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నేను ఫోన్ వాడుతూనే ఉంటాను. అలా వాడడం వల్ల తలనొప్పి వచ్చేసిది. దీంతో ఇప్పుడు వాడడం కొంచెం తగ్గించాను. నైట్ 7 గంటలకు అల్లా ఫోన్ పక్కన పెట్టేస్తాను. మా పిల్లలు కూడా ఫోన్ ని బాగా వాడేస్తుంటారు” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మహేష్ సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపిస్తుంటాడు. అయితే మహేష్ కూతురు సితార మాత్రం నిత్యం సోషల్ మీడియా పోస్టులతో సందడి చేస్తుంటుంది.
Varun Tej : వరుణ్ లావణ్యల పెళ్లి ఇండియాలోనా..? ఫారిన్‌లోనా.. వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?
కాగా ఇదే ఈవెంట్ లో గుంటూరు కారం (Guntur Kaaram) అప్డేట్ కూడా ఇచ్చాడు. షూటింగ్ లేట్ అవ్వడం, చిత్ర యూనిట్ నుంచి ఒక్కొక్కరిగా అందరూ బయటకి వెళ్లిపోతుండడంతో రిలీజ్ మళ్ళీ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి చేంజ్ లేదని తెలియజేశాడు మహేష్. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటివరకు కనిపించని మాస్ రోల్ లో మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.