Varun Tej : వరుణ్ లావణ్యల పెళ్లి ఇండియాలోనా..? ఫారిన్‌లోనా.. వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తేదీపై, మ్యారేజ్ ఎక్కడ జరగబోతున్నదని అనే విషయాలు పై ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వీటిన్నటి పై వరుణ్ రెస్పాండ్ అయ్యాడు.

Varun Tej : వరుణ్ లావణ్యల పెళ్లి ఇండియాలోనా..? ఫారిన్‌లోనా.. వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?

Varun Tej Lavanya Tripathi marriage place and date details

Updated On : October 29, 2023 / 11:20 AM IST

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని తమ ప్రేమ విషయాన్ని అందరికి తెలియజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ జూన్ 9న ఇరు కుటుంబసభ్యుల మధ్య నిశ్చితార్థం జరుపుకొని పెళ్ళికి సిద్ధమయ్యారు. ఇక ఈ పెళ్లి తేదీపై, మ్యారేజ్ ఎక్కడ జరగబోతున్నదని అనే విషయాలు పై ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లి ఫారిన్ లో జరగబోతుందని, మ్యారేజ్ ని కూడా కేవలం కుటుంబసభ్యుల మధ్యనే జరుపుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Varun Tej : లావణ్యతో ప్రేమ విషయం చివరివరకు సీక్రెట్‌గా ఉంచడానికి రీజన్ తెలిపిన వరుణ్.. ఎందుకో తెలుసా..?

తాజాగా వీటిన్నటి పై వరుణ్ రెస్పాండ్ అయ్యాడు. ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి తేదీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అండ్ ప్రమోషన్స్ చూసుకొని ఆ డేట్ ని ఫైనల్ చేస్తాం. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుంది. అలాగే పెళ్లి ఎక్కడ అన్నది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇండియాలో ఒక మూడు, ఫారిన్ లో రెండు ప్లేస్ లు పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరి ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలో మాత్రమే పెళ్లి జరగనుంది. కేవలం ప్రైవసీ కోసమే పెళ్లిని ఇతర రాష్ట్రం లేదా దేశంలో అనుకుంటున్నాము. లేదంటే హైదరాబాద్ లోనే చేసుకునేవాళ్లం” అంటూ తెలియజేశాడు.

Kushi : ఖుషి ప్రమోషన్స్‌కి సమంత గుడ్ బై చెప్పేసిందా..? కారణం అదేనట..!

కాగా పెళ్లి తేదిని వరుణ్ తేజ్ అమ్మ పద్మజ చూసుకుంటున్నారట. ఇక ‘గాండీవధారి అర్జున’ మూవీ విషయానికి వస్తే.. ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దాదాపు 80 శాతం షూటింగ్ ఫారిన్ లో జరుపుకున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటిస్తుంది.