Varun Tej : లావణ్యతో ప్రేమ విషయం చివరివరకు సీక్రెట్‌గా ఉంచడానికి రీజన్ తెలిపిన వరుణ్.. ఎందుకో తెలుసా..?
లావణ్య త్రిపాఠితో ప్రేమ విషయాన్ని ఎంగేజ్మెంట్ వరకు సీక్రెట్ గా ఉంచడానికి కారణం ఏంటో వరుణ్ తేజ్ తెలియజేశాడు.

Varun Tej shares why he maintain secrecy in love with Lavanya Tripathi
Varun Tej – Lavanya Tripathi : టాలీవుడ్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారం ఎవరు ఊహించని విషయం. మెగా హీరోలు అందరిలో పోలిస్తే వరుణ్ చాలా తక్కువ మాట్లాడతాడు, సినిమా ఫంక్షన్స్ టైంలో కూడా స్టేజి పై మాట్లాడానికి ఎంతో సిగ్గుపడుతుంటాడు. అలాంటి వరుణ్.. ఇండస్ట్రీలోని ఒక హీరోయిన్ తో ప్రేమాయణం నడపడం, అదికూడా చివరివరకు ఎవరికి తెలియకుండా ఉంచడం అందర్నీ షాక్ కి గురి చేసింది. జూన్ 9న ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. అందరికి వారి ప్రేమ ప్రయాణం గురించి తెలియజేశారు.
Kushi : ఖుషి ప్రమోషన్స్‌కి సమంత గుడ్ బై చెప్పేసిందా..? కారణం అదేనట..!
ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈక్రమంలోనే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు ఇద్దరు మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది అనేది తెలియజేశాడు. ‘మిస్టర్’ మూవీలో ఇద్దరు కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మూవీ తరువాత కూడా టచ్ లో ఉంటూ వచ్చారు. ఆ తరువాత మళ్ళీ ‘అంతరిక్షం’ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఈ మూవీ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. ఇద్దరి మైండ్ సెట్ అండ్ ఆలోచనలు ఒకటే అవ్వడంతో జీవితంలో ఇద్దరు కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ప్రేమ విషయాన్ని బయటపెట్టకపోవడానికి కారణం కూడా తెలియజేశాడు. ముందు నుంచి తాను ప్రైవేట్ పర్సన్ కావడంతో పర్సనల్ విషయాలు బయట ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అందువల్లే ప్రేమ గురించి మాట్లాడడం, లేక బయట ఇద్దరు కలిసి కనిపించడం జరగలేదని పేర్కొన్నాడు. అంతెందుకు ఎంగేజ్మెంట్ తరువాత కూడా లావణ్యతో ఇప్పటివరకు బయట కనపడకపోవడానికి కారణం కూడా ఆ మనస్తత్వమే తప్ప, సీక్రెట్ మెయిన్‌టైన్ చేయాలనీ కాదని వెల్లడించాడు.