Kushi : ఖుషి ప్రమోషన్స్‌కి సమంత గుడ్ బై చెప్పేసిందా..? కారణం అదేనట..!
విజయ్ దేవరకొండ ఖుషి మూవీ ప్రమోషన్స్ కి సమంత గుడ్ బై చెప్పేసిందట. ఇందులో నిజమెంత ఉంది..?

Samantha says good bye to Vijay Deverakonda kushi movie promotions
Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖుషి’. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం సమంత అనారోగ్యం కారణంతో షూటింగ్ లేట్ అయ్యింది. ఇటీవలే అన్ని పనులు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ సాంగ్స్ అండ్ ట్రైలర్ ని తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల చేసుకుంటూ వచ్చారు.
BRO Movie : ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
ఇక ఇప్పుడు ప్రమోషన్స్ పనిలో ఉన్న చిత్ర యూనిట్ ప్రెస్ మీట్స్ అండ్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఇటీవల తెలుగులో మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో సమంత కూడా పాల్గొంది. అంతేకాదు విజయ్ తో కలిసి స్టేజి పై డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పటి నుంచి సమంత ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో కనబడదని తెలుస్తుంది. మ్యూజికల్ కాన్సర్ట్ తోనే ఖుషి ప్రమోషన్స్‌కి సమంత గుడ్ బై చెప్పేసిందని తెలుస్తుంది. ఆ మ్యూజికల్ కాన్సర్ట్ అవ్వగానే సమంత.. తన తల్లితో కలిసి అమెరికా వెళ్లిపోయింది.
సినిమా విడుదలకు కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో సమంత అమెరికా వెళ్లిపోవడంతో ఆమె ఖుషి ప్రమోషన్స్ లో ఇంక కనిపించదని చెబుతున్నారు. అయితే సామ్ అమెరికా వెళ్ళడానికి కారణం.. న్యూయార్క్ నగరంలో జరగబోయే భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమంత వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నెల 20న జరగనున్న ఆ వేడుకలకు సమంతతో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిస్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందింది. ఈ వేడుక తరువాత సమంత కొన్నిరోజులు అక్కడే ఉండనుందని వార్తలు వస్తున్నాయి. మరి సమంత వెంటనే వచ్చేసి ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొటుందా? లేదా పూర్తిగా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందా? చూడాలి.