×
Ad

Gautam Ghattamaneni : గౌతమ్‌కి మహేష్, నమ్రతా, సితార బర్త్ డే విషెస్.. పోస్టులు వైరల్!

ఈ ఏడాదితో గౌతమ్ 17వ ఏటలోకి అడుగు పెడుతున్నాడు. ఈక్రమంలోనే మహేష్, నమ్రతా శిరోద్కర్, సితార సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలియజేస్తూ వేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published On : August 31, 2023 / 12:49 PM IST

Mahesh Babu Namrata Shirodkar Sitara birthday wishes to Gautam Ghattamaneni

Gautam Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ పుట్టినరోజు నేడు కావడంతో కుటుంబసభ్యులు అంతా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ఏడాదితో గౌతమ్ 17వ ఏటలోకి అడుగు పెడుతున్నాడు. ఈక్రమంలోనే మహేష్, నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar), సితార (Sitara) సోషల్ మీడియాలో వేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఇలా రాసుకొచ్చాడు.. “హ్యాపీ 17 మై చాంప్. నా ప్రతి అడుగు నిన్ను నీ గమ్యం వైపు చేర్చేలా ఉంటుంది. నువ్వు ఇంకా ఎత్తుకి ఎదగాలి” అంటూ విష్ చేశాడు.

Jawan Trailer : షారుఖ్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌తో..

ఇక నమ్రతా పోస్ట్ విషయానికి వస్తే.. “హ్యాపీ బర్త్ డే గౌతమ్. నువ్వు ఎదుగుతున్న ప్రతి సంవత్సరం మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు ఇంకా ఎత్తుకి ఎదగాలి, నువ్వు కన్న కలలను నెరవేర్చుకోవాలి. ఈ పుట్టినరోజు మాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వచ్చే ఏడాది నువ్వు మాకు దూరంగా ఉంటావు. కాబట్టి ఈ బర్త్ డేని స్పెషల్ గా చేస్తాను” అంటూ పేర్కొంది. చివరిగా సితార.. “నువ్వే నా బలం, నా ప్రపంచం. ఐ లవ్ యు. హ్యాపీ బర్త్ డే అన్నయ్య” అంటూ గౌతమ్ తో ఉన్న పిక్ ని షేర్ చేసింది.

MAD Movie Teaser : ఇంజనీరింగ్ పోరలు రచ్చ.. ‘మ్యాడ్’ మూవీ టీజర్ చూసి మ్యాడ్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేష్ అభిమానులు కూడా గౌతమ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా గౌతమ్ ‘1 నేనొక్కడినే’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక ఇటీవల సితార యాడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో గౌతమ్ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని నమ్రతాని మీడియా ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. మరో 10 ఏళ్ళు సమయం పడుతుందని బదులిచ్చింది.