Mahesh Babu – Ashok Galla : ‘నాని’ సినిమాలో మహేష్ తో నటించి.. మహేష్ మేనల్లుడు ఇప్పుడు హీరోగా..

మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు మహేష్ బాబుతో కలిసి నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

Mahesh Babu – Ashok Galla : ‘నాని’ సినిమాలో మహేష్ తో నటించి.. మహేష్ మేనల్లుడు ఇప్పుడు హీరోగా..

Mahesh Babu Nephew Ashok Galla acted in Nani Movie Recalled that Memories

Updated On : November 12, 2024 / 6:11 PM IST

Mahesh Babu – Ashok Galla : మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా గతంలో హీరో అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు దేవకీ నందన వాసుదేవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అశోక్ గల్లా. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా టిజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసారు.

ప్రస్తుతం దేవకీ నందన వాసుదేవ మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు మహేష్ బాబుతో కలిసి నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా చిన్నప్పుడు నాని సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ దీపక్ అనే పాత్రలో నటించాడు. నాని సినిమాలో మహేష్ చిన్న పిల్లాడి నుంచి పెద్దగా, మళ్ళీ చిన్నగా మారిపోతాడని తెలిసిందే. ఇందులో మహేష్ చిన్నప్పటి పాత్రకు దీపక్ అనే బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. అది అశోక్ గల్లానే చేసాడు. మహేష్ బాబుతో కూడా అశోక్ కు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి.

Also Read : Balakrishna : బాలకృష్ణ NBK 109 టైటిల్ అప్డేట్.. టైటిల్, టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

దీన్ని గుర్తుచేసుకుంటూ అశోక్ గల్లా మాట్లాడుతూ.. చిన్నప్పుడు సరదాగా చేసాను నాని సినిమా. మామయ్యతో సరదాగా ఉండేది. పెద్ద కష్టం అనిపించేది కాదు. మామయ్య మాతో బాగానే ఉంటాడు కాబట్టి ఈజీగానే అయిపోయింది అని అన్నాడు. ఇప్పుడు కూడా మహేష్ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఇస్తే కచ్చితంగా చేస్తాను అని తెలిపాడు.