Mahesh Babu new looks for Rajamouli film SSMB29
Mahesh Babu – Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Karam) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దాని పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఇక మహేష్ ఏమో ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ ట్రిప్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ఒక ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అవి కాస్త బాగా వివారాలు అయ్యాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసే ఫోటోలను షేర్ చేశాడు.
NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..
జీన్స్ డ్రెస్ లో కూల్ కళ్లజోడుతో చెదిరిన క్రాప్ (హెయిర్) లో మ్యాన్లీ లుక్స్ అదరగొడుతున్నాడు. మహేష్ లుక్స్ చూస్తుంటే హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. కాగా మహేష్ తన తదుపరి సినిమా రాజమౌళితో తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి ఇప్పటికే చెప్పికొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ లుక్స్ చూసిన నెటిజెన్లు ఆ మూవీ (SSMB29) కోసం చేసిన టెస్ట్ లుక్స్ అనుకుంటా అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిమైనప్పటికీ ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Super Star Mahesh Babu Ultra Stylish looks Photos gone viral
ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
Super Star Mahesh Babu Ultra Stylish looks Photos gone viral
Super Star Mahesh Babu Ultra Stylish looks Photos gone viral