Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు కొత్త లుక్స్.. ట్రెండ్ అవుతున్న SSMB29

తాజాగా మరోసారి మహేష్ బాబు ఒట్టో కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు కొత్త లుక్స్.. ట్రెండ్ అవుతున్న SSMB29

Mahesh Babu New Photos goes Viral SSMB 29 Trending in Social Media

Updated On : April 2, 2024 / 10:02 AM IST

Mahesh Babu : మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో సక్సెస్ కొట్టి రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి స్విట్జర్లాండ్ వెళ్ళాడు మహేష్. అక్కడి నుండి మహేష్ ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్ తన సోషల్ మీడియాలో కొత్త లుక్స్ తో కొత్త ఫోటోలు షేర్ చేశారు.

ఒట్టో క్లాతింగ్ బ్రాండ్ కి మహేష్ బాబు అంబాసిడర్ అని తెలిసిందే. గతంలో కూడా ఈ బ్రాండ్ కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసి ఫొటోలు షేర్ చేసారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఒట్టో కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మహేష్ కొత్త లుక్స్ లో కనపడుతున్నాడని, ఏజ్ పెరుగుతున్నా ఇంకా అదే అందం అని మహేష్ అభిమానులతో పాటు, నెటిజన్లు కూడా పొగిడేస్తూ మహేష్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Also Read : Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ అసలు పేరేంటో తెలుసా? మరి పేరు ఎవరు మార్చారు?

దీంతో మహేష్ బాబు కొత్త ఫోటోలు వైరల్ గా మారాయి. పనిలో పనిగా మహేష్ కొత్త ఫోటోలు షేర్ చేస్తూ SSMB29 హ్యాష్ ట్యాగ్ కూడా ఇస్తుండటంతో రాజమౌళి – మహేష్ బాబు సినిమా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇక రాజమౌళి – మహేష్ సినిమా ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం.