Mahesh Babu : అబ్బాయి సినిమా కోసం బాబాయ్ రావట్లేదా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టేనా? నిరాశలో మహేష్ ఫ్యాన్స్..
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు వస్తాడని, అన్నయ్య కొడుకు కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తారని వార్తలు వచ్చాయి. (Mahesh Babu)
- Saketh U
- Published on- July 26, 2026 / 02:27 PM IST
Mahesh Babu
Mahesh Babu : కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జయకృష్ణ, బాలీవుడ్ భామ రషా తడాని జంటగా తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా జులై 30న రిలీజ్ కాబోతుంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. మోహన్ బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అయితే అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు వస్తాడని, అన్నయ్య కొడుకు కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తారని వార్తలు వచ్చాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా వైరల్ అయింది. కానీ ఆ డేట్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు,మహేష్ రాలేదు. సినిమా రిలీజ్ కి ఇంకా మూడు రోజులు ఉంది, ఇప్పటికైనా మహేష్ వస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని కొంతమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Mahesh Babu : మా రమేష్ అన్నయ్య కొడుకు వస్తున్నాడు.. జయకృష్ణ సినిమాపై మహేష్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్
అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే అనిపిస్తుంది. మహేష్ బాబు కూడా అబ్బాయి జయకృష్ణ కోసం వచ్చేలా కనిపించట్లేదు. ఇటీవల జయకృష్ణ మీడియాతో మాట్లాడగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయం గురించి అడిగితే సమాధానం చెప్పకుండా చెప్తాము చెప్తాము అని సింపుల్ గా తప్పించుకున్నారు.
నేడు రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కూడా మహేష్ బాబు సినిమా ఈవెంట్ కి వస్తారా అని అడగ్గా దర్శకుడు అజయ్ భూపతి.. ఆయన ఈ సినిమా కోసం ఏం చేసారో, ఏం చేస్తున్నారో దానికి మేము హ్యాపీ. ఆయనకు ఈ సినిమాకు ఎలా సపోర్ట్ చేయాలో ఆయనకు తెలుసు. ఆయన కొడుకు సినిమా వస్తే సపోర్ట్ చేయరా. ఆయన ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకున్నారు. ఆల్రెడీ సినిమా చూసారు. టీజర్, ట్రైలర్స్ చూసి మాకు మెసేజ్ లు చేసారు అని చెప్పారు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారో రారో మాత్రం చెప్పలేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ రాకపోతే ఓ వీడియో చేసి సినిమా టీమ్ కి అలా ది బెస్ట్ చెప్తూ రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు అంతా. అనుకున్నట్టే నేడు మహేష్ బాబు జయకృష్ణకు, మూవీ యూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. దీంతో ఇక ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినట్టే, ఒకవేళ జరిగినా మహేష్ రాడు అనే అర్థం అవుతుంది. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. మహేష్ మీడియా ముందుకు, అభిమానుల ముందుకు వచ్చి మాట్లాడి చాలా రోజులు అవుతుంది. జయకృష్ణ ను తన అభిమానులకు పరిచయం చేయడానికి వస్తారేమో అని ఘట్టమనేని ఫ్యాన్స్ ఎదురుచూసారు కానీ నిరాశ తప్పేలా లేదు. అయితే మహేష్ వారణాసి సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారని చెప్తున్నారు.
