Mahesh Babu producers are facing release difficulties
Akhanda 2: సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎదో కొత్త కారణం వల్ల డిలే అవుతూ ఉంటాయి. ఇప్పుడు అఖండ 2 సినిమా విషయంలో అదే జరిగింది. ఇప్పటికే, రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. దీంతో, నందమూరి అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, అఖండ 2 సినిమా వాయిదా కారణం మహేష్ బాబు సినిమా అని తెలిసి మహేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు బాలకృష్ణ ఫ్యాన్స్. అఖండ 2 మేకర్స్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ గతంలో మహేష్ బాబుతో దూకుడు, ఆగడు, 1 నేనొక్కడినే సినిమాలు చేశారు. వీటిలో ఈరోస్ ఇంటర్నేషనల్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ మూడు సినిమాల్లో దూకుడు బాగానే ఆడినా.. మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
Akhanda 2: అఖండ 2 రిలీజ్ పై 14 రీల్స్ అఫిషియల్ ప్రకటన..
దీంతో, ఈ రెండు నిర్మాణ సంస్థల మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో, తమ డబ్బులు క్లియర్ చేసేవరకు అఖండ 2 సినిమాను రిలీజ్ చేయకూడదు అంటూ కోర్టు నుంచి స్టే విధించింది. దీంతో, అఖండ 2(Akhanda 2) సినిమా వాయిదా పడింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, గతంలో క్రాక్ సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురయ్యింది. క్రాక్ సినిమాను ఠాగూర్ మధు నిర్మించాడు. ఈ సినిమా విడుదల సమయంలో స్పైడర్ సినిమాకు సంబందించిన లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
స్పైడర్ సినిమాకు కూడా ఠాగూర్ మధు నిర్మాతగా ఉన్నారు. కాబట్టి, ఆ అమౌంట్ క్లియర్ చేసేవరకు క్రాక్ సినిమా విడుదల చేయకూడదు అంటూ కోర్టుకెక్కారు. ఆ దాంతో క్రాక్ సినిమా కూడా వాయిదా పడాల్సి వచ్చింది. కానీ, తరువాత విడుదలై మంచి విజయం సాధించింది. ఇలా మహేష్ బాబుతో సినిమాలు చేసి లాస్ అయిన నిర్మాతలు ఇబ్బదులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు అఖండ 2కి కూడా మహేష్ బాబు సినిమానే కారణం అవడంతో ఆయనపై నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అప్పుడు క్రాక్ సినిమాలానే ఇప్పుడు అఖండ 2 సినిమా కూడా కాస్త ఆలస్యంగా వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తన్నాయి. త్వరలోనే అఖండ 2 విడులపై అధికారిక ప్రకటన రానుంది.