Akhanda 2: అఖండ 2 రిలీజ్ పై 14 రీల్స్ అఫిషియల్ ప్రకటన..

బాలకృష్ణ అఖండ 2 (Akhanda 2)పోస్ట్ పోన్ అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అవుతుంది అను అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ అనూహ్యంగా వాయిదా పడటం చర్చనీయాంశం అయ్యింది.

Akhanda 2: అఖండ 2 రిలీజ్ పై 14 రీల్స్ అఫిషియల్ ప్రకటన..

14 Reels entertainment key announcement on Akhanda 2 release

Updated On : December 6, 2025 / 6:50 AM IST

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 పోస్ట్ పోన్ అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అవుతుంది అను అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ అనూహ్యంగా వాయిదా పడటం చర్చనీయాంశం అయ్యింది. నందమూరి అభిమానులు ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా అలా ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ విషయంపై బాలకృష్ణ కూడా కోపంగా ఉన్నారని సమాచారం. ఇక వాయిదా తరువాత రిలీజ్ ఎప్పుడు ఉంటుందని అందరు ఎదుచూస్తున్న తరుణంలో మేకర్స్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది.

Akhanda 2-RajaSaab: అఖండ 2 బాటలోనే రాజాసాబ్?.. సంక్రాంతికి రిలీజ్ కష్టమేనా?.. ఆందోళనలో ఫ్యాన్స్..

తమ సోషల్ మీడియాలో నోట్ విడుదల చేశారు. “అఖండ2(Akhanda 2) ని థియేటర్స్ కి తీసుకురావడానికి మా ప్రయత్నం చేశాము. కానీ, కొన్నిసార్లు ఊహించని విషయాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, సినీ ప్రేమికులకు మేము క్షమాపణలు చెప్తున్నాం. ఈ పరిస్థితులలో మాకు తోడుగా ఉన్నందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు కృతజ్ఞులు. అఖండ 2 ఎప్పడు వచ్చినా గురి సూపర్ హిట్ అవుతుంది. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.

అయితే, మేకర్స్ విడుదల చేసిన ఈ కొత్త నోట్ తో అభిమానుల్లో మరో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. అసలు సినిమా విడుదల ఇప్పుడు ఉంటుందా.. లేదా. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని చెప్పారంటే మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నారా అనే టాక్ నడుస్తోంది. ఇక అఖండ 2 మేకర్స్ ఆర్థిక లావాదేవీల విషయంలో ఇండస్ట్రీ పెద్దల మధ్య చర్చలు జరిగాయని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చెప్పారు. దాంతో, ఈ వివాదం సద్దుమణుగుతుంది. సాయంత్రం విడుదల అవుతుంది సినిమా అని అనుకున్నారు అంతా. కానీ, మేకర్స్ ప్రకటనతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. కాబట్టి, అఖండ 2 సినిమా మరోసారి వాయిదా పడింది అనుకోవడమే ఇక. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు. అందరు అనుకుంటున్నట్టుగానే సంక్రాంతి బరిలో దించుతారా అనేది చూడాలి.