Mahesh Babu : జిమ్‌లో పెంపుడు కుక్కతో కలిసి మహేష్ బాబు కసరత్తులు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల్ని ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా మహేష్ ఫోటో వైరల్ అవుతోంది.

Mahesh Babu

Mahesh Babu : వరుసగా జిమ్ నుండి ఫోటోలు షేర్ చేస్తున్న మహేష్ బాబు లేటెస్ట్‌గా మరో ఫోటో షేర్ చేసారు. సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది.

Can you guess : ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టగలరా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య ఎక్కువగా జిమ్‌లో గడుపుతున్నారు. వర్కౌట్లు చేస్తున్న ఫోటోలు వరుసగా షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు జిమ్‌లో తన పెంపుడు కుక్కతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ విశ్రాంతి అనేది ఉండదు.. మీకు అందమైన ట్రైనర్ శిక్షణ ఇస్తుంటే’ అనే శీర్షికతో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

మహేష్ ఇంట్లో గతంలో రెండు పెంపుడు కుక్కలు ఉండేవి. కొంతకాలం క్రితం వాటిలో ఒకటైన్ ఫ్లూటో చనిపోయింది. దాంతో స్నూపీ అనే డాగ్ ను దత్తత తీసుకున్నారు. ఇటీవల తరచూ మహేష్ డాగ్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిపై తనకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంలో కూడా మహేష్ డాటర్ సితార ఆపదలో ఉన్న వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. వీరి కుటుంబానికి జంతువుల పట్ల ఉన్న ప్రేమ అలాంటిది మరి.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ లేటెస్ట్ అప్‌డేట్‌.. వర్చువల్ స్టూడియోలో షూటింగ్

మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. 2024 జనవరి 12 న థియేటర్లలోకి రాబోతోంది. మహేష్‌కి జోడీగా మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.