Can you guess : ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టగలరా?
స్క్రీన్‌కి దూరమైన నటీనటులు కొంతకాలానికి గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. కానీ ఓ యంగ్ హీరోయిన్ లుక్ చూసి చాలామంది అవాక్కయ్యారు. ఎవరా నటి?

Thulasi Nair
Can you guess : హీరోయిన్స్ సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత వారిని గుర్తు పట్టలేకపోవడం సర్వసాధారణం. కానీ ఓ నటిని చాలామంది గుర్తు పట్టలేదు. ఆ తర్వాత ఎవరో పోల్చుకుని ఆశ్చర్యపోయారు. ఎవరా నటి? ఎక్కడ కనిపించారు.

Thulasi Nair
Bigg Boss 7 Telugu Elimination : ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేషన్..!
నటి రాధ 80 లలో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. ఒక దశాబ్దం పాటు నాన్ స్టాప్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. నటి రాధకు ఇద్దరు కుమార్తెలు అన్న విషయం తెలిసిందే. ఒకరు కార్తీక, మరొకరు తులసి. ఇద్దరు కూడా సినిమాల్లో నటించారు. కార్తీక 2009 లో నాగ చైతన్య సినిమా ‘జోష్’ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. ఇటీవల కార్తీక వివాహం వేడుకగా జరిగింది. ఆ పెళ్లిలో కనిపించిన ఓ అమ్మాయిని చూసి చాలామంది గుర్తు పట్టలేకపోయారు. ఎవరీమె అనుకున్నారు? ఆ అమ్మాయి మరెవరో కాదు రాధ రెండవ కుమార్తె తులసి నాయర్.
Tripti Dimri : యానిమల్ సినిమాలో రష్మిక కంటే ఎక్కువగా ఈ హీరోయిన్‌కి పేరొస్తుంది? ఎవరు ఈ హీరోయిన్?
తులసి నాయర్ 2013 లో మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ‘కడలి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత రవి కె.చంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ‘యాన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా రంగం 2 గా తెలుగులో విడుదలైంది. ఆ తర్వాత తులసి సినిమాల్లో కనిపించలేదు. మళ్లీ కార్తీక పెళ్లిలో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించిన తులసిని చూసి ఎవరా? అనుకున్నారు. ఆ తర్వాత తులసి అని అవాక్కయ్యారు. సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ భామ ఇంత బొద్దుగా మారిపోయిదేంటని ఆశ్చర్యపోయారు.
View this post on Instagram