×
Ad

Mahesh Babu: దర్శకధీరుడి పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడు (Mahesh Babu)రాజమౌలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి సత్తా చాటాడు.

Mahesh Babu shares special photo on Rajamouli's birthday

Mahesh Babu: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌలి. బాహుబలి,(Mahesh Babu) ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి సత్తా చాటాడు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమరూన్ లాంటి హాలీవుడ్ దర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. గ్లొబ్ ట్రోటర్ అనే ట్యాగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. యాక్షన్, అడ్వెంచర్ అండ్ డివోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు “వారణాసి” అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. నవంబర్ లో ఈ సినిమా నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను విడుదల చేయనున్నారు.

Ranbir Kapoor: వారసుడైతే చూడాలా.. కష్టపడకుండా ఏదీ రాదు.. నన్ను కూడా అలాగే అనుకుంటారు..

ఇదిలా ఉంటే, అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్బంగా ఒక ప్రత్యేకమైన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “ఇండస్ట్రీలో ఉన్న ఒకేఒక్క దర్శకధీరుడు రాజమౌళికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెరకెక్కించేవన్నీ అద్భుతాలే. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రాబోతోంది’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో మహేష్ బాబు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం రాజమౌళికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.