Ranbir Kapoor: వారసుడైతే చూడాలా.. కష్టపడకుండా ఏదీ రాదు.. నన్ను కూడా అలాగే అనుకుంటారు..
యానిమల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor). తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.910 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Hero Ranbir Kapoor comments on nepotism in the Bollywood industry
Ranbir Kapoor: యానిమల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.910 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు రణబీర్. ఆ పాత్రలో తాను తప్పా ఇంకెవరూ చేయలేరు అనే రేంజ్ లో అలరించాడు. అయితే, రణబీర్ ఇటీవల ఇండస్ట్రీలో నేపోటీజం(Ranbir Kapoor) గురించి మాట్లాడాడు. వారసులు అయితే ఆడియన్స్ మనల్ని చూడాలా? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Kiran-Ravi: కిరణ్ అబ్బవరం ప్రశ్న.. నిర్మాత సమాధానం.. అలా మాట్లాడటం కరక్ట్ కాదంటున్నాడు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కానీ, నాకు మాత్రం అది ఒక సాధారణ కుటుంబమే. మా ఇంట్లో కూడా సినిమాల గురించి చాలా చర్చలు జరిగేవి. “ఫిల్మ్ మేకింగ్ నటీనటులందరూ కలిసి పాల్గొనే పెళ్లిలాంటిది. అది ఒక నమ్మకం, దానిపై ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడం” అని ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ చెప్పేవారట. ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇక్కడ విజయం సాధించడం కష్టం. అవకాశాలు ఈజీ వస్తాయేమో కానీ, కష్టపడకుండా సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. నేనెప్పుడూ కష్టపడుతూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో విజయాలు, అపజయాలు చూశాం. సక్సెస్ ఎంత నేర్పిస్తుందో, ఫెయిల్యూర్ కూడా అంతే నేర్పిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక యానిమల్ లాంటి హిట్ తరువాత రణబీర్ కపూర్ ప్రస్తుతం “రామాయణ” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాలో సాయి పల్లవి సీతలా నటిస్తుండగా.. కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. మొదటి పార్ట్ 2026 ద్విదతియార్ధంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.