Gautam Ghattamaneni : మహేష్ తనయుడి యాక్టింగ్ వీడియో చూశారా? నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడుగా.. వీడియో వైరల్..

తాజాగా మహేష్ తనయుడు గౌతమ్ యాక్టింగ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Mahesh Babu Son Gautam Ghattamaneni Acting Video goes Viral

Gautam Ghattamaneni : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేస్తాడు. ఇప్పటికే గౌతమ్ యాంక్టింగ్ చేసినట్టు, స్కిట్స్ వేసినట్టు గతంలో నమ్రత తెలిపింది.

తాజాగా మహేష్ తనయుడు గౌతమ్ యాక్టింగ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. అక్కడ అమెరికాలో తనతో కలిసి చదువుకునే ఫ్రెండ్స్ తో కలిసి ఓ చిన్న మైమ్ వీడియో చేసారు. బ్రెయిన్ వాషింగ్ అనే పేరుతో తీసిన ఈ వీడియోలో గౌతమ్ ఘట్టమనేని, కశ్వీ రమణి కలిసి నటించారు. సెరఫీనా జెరోమ్ ఈ వీడియోని డైరెక్ట్ చేసింది.

Also Read : Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్..

ఇందులో గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ మీద అరిచే బాయ్ ఫ్రెండ్ గా కాస్త నెగిటివ్ షేడ్స్ లో కనపడ్డాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ గౌతమ్ బాబు రెడీ అవుతున్నాడు, త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడు, యాక్టింగ్ అదరగొడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా గౌతమ్ యాక్టింగ్ చేసిన వీడియో చూసేయండి..