Mahesh Babu : నమ్రతకు మహేష్ స్పెషల్ విషెష్.. భార్య పుట్టిన రోజుకు దూరంగా మహేష్..

నేడు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) పుట్టిన రోజు. కానీ మహేష్ బాబు ఇక్కడ అందుబాటులో లేడు.

Mahesh Babu Special Birthday Wishes to his wife Namrata Shirodkar

Mahesh Babu : మహేష్ బాబు ఇటీవలే గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో భారీ సక్సెస్ సాధించాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ జర్మనీలో ఉన్నాడు. రెండు రోజుల క్రితమే సోలోగా మహేష్ జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ సోలోగా జర్మనీకి ఎందుకు వెళ్ళాడు అనేది అధికారికంగా తెలియకపోయినా రాజమౌళి సినిమా వర్క్ కోసమే అని సమాచారం.

నేడు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) పుట్టిన రోజు. కానీ మహేష్ బాబు ఇక్కడ అందుబాటులో లేడు. అయితే ఎప్పటిలాగే మహేష్ తన సోషల్ మీడియాలో భార్యకు స్పెషల్ విషెష్ తెలిపాడు. నమ్రత ఫోటో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే NSG. ఈ ఏడాది మరింత ప్రేమగా, ఆనందంగా ఉండాలి. నా ప్రతిరోజుని మరింత అందంగా, స్పెషల్ గా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని ట్వీట్ చేసాడు.

Also Read : Anna Ben : ప్రభాస్ ‘కల్కి’లో మలయాళం స్టార్ హీరోయిన్.. ఇంకెంతమందిని తెస్తారు బ్రో..

నమ్రతకు ఇది 52వ పుట్టినరోజు. మహేష్ కంటే నమ్రత నాలుగేళ్ళు పెద్ద అని తెలిసిందే. మహేష్ ఇలా ప్రతి సంవత్సరం తన భార్య పుట్టిన రోజున స్పెషల్ గా విషెష్ తెలుపుతారు. కానీ ఈ సంవత్సరం నమ్రత పుట్టిన రోజున మహేష్ దూరంగా ఉన్నాడు. ఇక పలువురు ప్రముఖులు, అభిమానులు నమ్రతకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.