Anna Ben : ప్రభాస్ ‘కల్కి’లో మలయాళం స్టార్ హీరోయిన్.. ఇంకెంతమందిని తెస్తారు బ్రో..
కల్కి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.

Malayalam Actress Anna Ben plays a Key Role in Prabhas Kalki 2898AD Movie
Anna Ben : ప్రభాస్(Prabhas) త్వరలో కల్కి 2898AD సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సలార్ తో హిట్ కొట్టిన ప్రభాస్ మే 9న కల్కి సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కల్కి సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక కల్కి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని ఉంటారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాడు. రానా కూడా అంటాడని తనే ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇక కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో మలయాళ భామ నటిస్తుందని సమాచారం.
మలయాళం హీరోయిన్ అన్నా బెన్ ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని అన్నా బెన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మలయాళంలో కుంబలంగి నైట్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన అన్నా బెన్ ఆ తర్వాత వరుసగా హెలెన్, సారా, కప్పేలా, కాపా.. ఇలా వరుస సినిమాలతో హిట్స్ కొట్టింది. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో కూడా ఓ సినిమా ఒప్పుకుంది. ఈమెకు తెలుగులో కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాలో కూడా ఓ పాత్ర చేసానని చెప్పడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. అన్నా బెన్ తండ్రి బెన్నీ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ రచయిత.
Also Read : Chiranjeevi Ram Charan : అభిమానులను కలిసిన చిరంజీవి, చరణ్.. ఫొటోలు
ఇక అన్నా బెన్ కూడా కల్కి సినిమాలో ఉండటంతో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి. ఇంకెంతమంది స్టార్స్ ని తీసుకొస్తారు, గ్రాండ్ గా నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నాడో అని ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.