Guntur Kaaram : గుంటూరు కారం సెట్స్ నుంచి వీడియో సాంగ్ లీక్.. మహేష్, శ్రీలీల మాస్ డాన్స్..
మహేష్ అండ్ శ్రీలీల పై మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో సెట్స్ నుంచి లీక్ అయ్యింది.

Mahesh Babu Sreeleela dance video leak from Guntur Kaaram movie sets
Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన సాంగ్ షూట్ జరుగుతుంది. మహేష్ అండ్ శ్రీలీల పై ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో సెట్స్ నుంచి లీక్ అయ్యింది.
ఆ వీడియోలో మహేష్, శ్రీలీల కలిసి మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ లీక్ అయిన వీడియోలో మహేష్, శ్రీలీల డాన్స్ చూసిన అభిమానులు ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తిని కలిగించింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ ని రిలీజ్ చేశారు. మరి మూడో పాటగా ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాలో మొత్తం 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటికే 3 సాంగ్స్, ఆ బిట్ సాంగ్ షూట్ అయిపోయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది చివరి పాట.
Also read : Salaar : ‘సలార్’ని ఆ థియేటర్స్‌లో రిలీజ్ చేయడం లేదా.. షారుఖ్ వెర్సస్ ప్రభాస్..
#GunturKaaram pic.twitter.com/96ulyLqXSO
— iamro (@rohitbabu__) December 19, 2023
కాగా గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదని, రిలీజ్ కష్టం, మళ్ళీ వాయిదా పడుతుంది అని పలు వార్తలు వస్తున్నాయి. అలాగే సాంగ్స్ బాగోలేవంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇక గుంటూరు కారంపై ఇలా వరుస విమర్శలు వస్తుండడంతో నిర్మాత నాగవంశీ ఇటీవల సీరియస్ అవుతూ ఓ ట్వీట్ చేశారు. సినిమా పై వస్తున్న నెగటివ్ న్యూస్ అన్ని ఫేక్, అవి గాసిప్స్ మాత్రమే. కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ వార్తలు రాస్తారు. ఎలా రాస్తే మీరు రియాక్ట్ అవుతారో వాళ్లకి తెలుసు. మేము సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళు చెప్పే వార్తలు నిజం కాదు అని పోస్ట్ చేశారు. గుంటూరు కారం సినిమాని జనవరి 12నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.