Mahesh Babu Sreeleela Guntur Kaaram Kurchi Madathapetti Song Actress Purna Guest Apperance
Purnaa : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చి సందడి చేస్తుంది. రిలీజ్ కి ముందు ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా నేడు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా. అమ్మ సెంటిమెంట్ తో ఓ మాస్ కమర్షియల్ కథకి ఎమోషన్ జోడించి త్రివిక్రమ్ గుంటూరు కారంని తీర్చి దిద్దాడు.
ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ స్పెషల్ సాంగ్ లా దీన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఈ మాస్ బీట్ సాంగ్ కి అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే పాట రిలీజ్ చేసినప్పుడు ఈ సాంగ్ కేవలం మహేష్, శ్రీలీలతో తీశారని అనుకున్నారు. కానీ సినిమాలో చూస్తే ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.
గుంటూరు కారం సెకండ్ హాఫ్ లో ఈ కుర్చీ మడతబెట్టి సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో ఒకప్పటి హీరోయిన్ పూర్ణ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. గతంలో హీరోయిన్ గా పూర్ణ తెలుగులో మంచి విజయాలే అందుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. పెళ్లి చేసుకొని ఇటీవలే ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం మదర్ లైఫ్ ఆస్వాదిస్తూ సినిమాలకు దూరంగా ఉంది. కానీ అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, టీవీ షోలలో కనిపిస్తుంది.
ఇప్పుడు కుర్చీ మడతపెట్టి సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి అలరించింది. ఇందులో పూర్ణ డ్యాన్సర్ గా వస్తుంది. పూర్ణ ఈ సాంగ్ మొదలుపెట్టగా మధ్యలో మహేష్, శ్రీలీల జాయిన్ అవుతారు. దీంతో పూర్ణని చూసి ఆశ్చర్యపోయారు ఆడియన్స్. ఇక పూర్ణ కొంచెం లావు అయిందని కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణ కూడా సినిమా రిలిజ్ కి ముందు నిన్న ఈ సాంగ్ షూట్ టైంలో మహేష్, శ్రీలీల, తన బాబుతో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి మహేష్ కి, శేఖర్ మాస్టర్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. మొత్తానికి రిలీజ్ కి ముందు కుర్చీ మడతబెట్టి సాంగ్ వైరల్ అవ్వగా ఇప్పుడు పూర్ణ కూడా వైరల్ అవుతుంది.
పూర్ణ గతంలో మహేష్ శ్రీమంతుడు సినిమాలో రామ రామ సాంగ్ లో కూడా కనిపించి తన డ్యాన్స్ తో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమాలోనే కుర్చీ మడతబెట్టి సాంగ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం.