Guntur Kaaram : ‘గుంటూరు కారం’లో ఆ డ్యాన్స్ ఎపిసోడ్ హైలెట్ అసలు.. ‘నాది నక్కిలేసు గొలుసు..’కి శ్రీలీలతో బాబు మాస్ డ్యాన్స్..
ఈ సినిమా మొదటి హాఫ్ లో వచ్చే ఒక డ్యాన్స్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

Guntur Kaaram Mahesh Babu Sreeleela Dance Sequence highlight for Movie Audience Entertained in Theaters
Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 12న వచ్చింది. రిలీజ్ కి ముందు ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అమ్మ సెంటిమెంట్ తో ఓ మాస్ కమర్షియల్ కథకి ఎమోషన్ జోడించి త్రివిక్రమ్ గుంటూరు కారం రూపంలో తీసుకొచ్చాడు.
ప్రేక్షకులు అమ్మ సెంటిమెంట్ కి ఎమోషన్ ఫీల్ అవుతూనే మహేష్ బాబు స్టైల్, స్వాగ్, యాక్షన్ కి ఎంటర్టైన్ అవుతారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. సినిమాలో ఆడియన్స్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా మొదటి హాఫ్ లో వచ్చే ఒక డ్యాన్స్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్, సునీల్ తో ఓ స్పెషల్ డ్యాన్స్ ఎపిసోడ్ ప్లాన్ చేయగా ఇది బాగా వర్కౌట్ అయింది. ఇటీవల ధమాకా సినిమాలో పల్సర్ బైక్ సాంగ్ పెట్టగా ఇది కూడా వైరల్ అయింది. దీంతో గుంటూరు కారంలో కూడా ఓ స్పెషల్ డ్యాన్స్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.
మహేష్ బాబు తన మిర్చి గోడౌన్ లో కూర్చొని మందు సిట్టింగ్ వేస్తున్నప్పుడు శ్రీలీల, వెన్నెల కిషోర్ వస్తారు. మహేష్.. కిషోర్ ని సరదాగా ఓ పాట పాడమంటే.. ఏదో ఒక రాగం సాంగ్ పాడతాడు. దీంతో సౌందర్య చనిపోయింది అంటూ ఏడుస్తూ ఆ జ్ఞాపకాలు వద్దు ఇంకో పాట పాడమని అడుగుతాడు మహేష్. వెంటనే.. మహేష్ ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి సాంగ్ ప్లే చేయగా.. భూమిక చాలా మంచి హీరోయిన్ ఇప్పుడు సినిమాలు చెయ్యట్లేదు అని అంటాడు. అలాగే ఇప్పటి హీరోయిన్స్ మీద.. ఇప్పుడొచ్చే వాళ్లకి డ్యాన్స్ రాదు, చూడటానికి బాగోరు, తెలుగు రాదు అంటూ కౌంటర్లు వేస్తాడు మహేష్. దీంతో శ్రీలీలకి కోపం వచ్చి నన్ను చూడు అని.. చెప్పవే చిరుగాలి సాంగ్ కి డ్యాన్స్ వేస్తుంది. ఢీ షోలో వేసేలాగా మెలోడీ సాంగ్ కి బాడీ అంతా తిప్పేస్తూ మరీ స్టెప్పులు వేస్తుంది. ఇది చూసి షాక్ అయిన మహేష్ ఏంటి ప్రభుదేవా డూప్ ని తెచ్చావా అలా వేసేస్తుంది డ్యాన్స్ అంటాడు.
Also Read : Mahesh Babu : సుదర్శన్ థియేటర్‌లో మహేష్ బాబు.. ఫ్యాన్స్‌తో గుంటూరు కారం..
ఇక శ్రీలీల ఈసారి నాది నక్కిలేసు గొలుసు సాంగ్ ప్లే చేసి మహేష్ కూడా లాక్కొచ్చి డ్యాన్స్ వేస్తుంది.. మహేష్, శ్రీలీల కలిసి ఈ ఊపు ఉన్న పాటకి ఓ రేంజ్ డ్యాన్స్ వేస్తారు. పలాస సినిమాలోని నాది నక్కిలేసు గొలుసు సాంగ్ గతంలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. గతంలో డ్యాన్స్ మాస్టర్ పండు కూడా ఈ సాంగ్ కి డ్యాన్స్ చేయగా ఇది బాగా వైరల్ అయింది. పండు మాస్టర్ ని తీసుకొచ్చి ఈ సాంగ్ లో వెనకాల నిల్చోబెట్టడం మరో హైలెట్. ఈ పాట సిగ్నేచర్ స్టెప్ వేస్తూ పండు మాస్టర్ ఈ సాంగ్ లో వెనకాలే ఉంటాడు. దీంతో ఈ డ్యాన్స్ సీక్వెన్స్ మొత్తానికి థియేటర్స్ దద్దరిలుతున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ రచ్చ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోసారి రీలీల తన డ్యాన్స్ తో దుమ్ము దులిపితే మహేష్ బాబు గతంలో కంటే మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టాడు. బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులు చూడాల్సిందంటే థియేటర్ కి వెళ్లాల్సిందే.
????️ #GunturKaaram #Sreeleela ❤️ pic.twitter.com/nYuVaSQz9b
— Michael Scofield (@designbychandu) January 12, 2024