Mahesh Babu : పవన్ లాగే మహేష్.. SSMB29 పోస్టర్.. మహేష్ మెడలో ఉన్న లాకెట్ ఏంటి..? శివుడి బ్యాక్ డ్రాప్ లో..

రాజమౌళి, మహేష్ షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Mahesh Babu

Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోయినా నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసి నవంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వస్తుంది అంటూ ప్రకటించారు.

అయితే రాజమౌళి, మహేష్ షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో మహేష్ ఫేస్ కనిపించకపోయినా మెడలో ఒక లాకెట్ ఉంది. ఓ మాలకు ఆ లాకెట్ తగిలించారు. ఈ లాకెట్ లో మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్ష ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. దీంతో ఈ లాకెట్ వైరల్ గా మారింది. ఈ లాకెట్ చూసి బాహుబలి లాగే ఈ సినిమాలో శివుడి బ్యాక్ డ్రాప్ లో కూడా కాస్త కథ ఉంటుందేమో అనుకుంటున్నారు.

Also Read : Mahesh Babu Birthday : మహేష్ బాబు 50వ బర్త్ డే.. శుభాకాంక్షలు వెల్లువ.. చిరు, వెంకీమామతో సహా ఎవరెవరు చెప్పారంటే..

గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సమయంలో చేతికి కట్టుకున్న ఓం లాకెట్ బాగా వైరల్ అయి, బయట సేల్స్ కూడా బాగా జరిగిన సంగతి తెలిసిందే. అలాగే బ్రో సినిమా సమయంలో కూడా పవన్ మెడలో ఉన్న లాకెట్ వైరల్ అయి సేల్స్ బాగా అయ్యాయి. ఆ లాకెట్ లో కూడా త్రిశూలం, మూడు నామాలు, ఓం, నంది తల ఉంటాయి. ఇప్పుడు మహేష్ పోస్టర్ లో ఈ లాకెట్ నే ఫోకస్ చేయడంతో ఈ లాకెట్ కూడా బయట మార్కెట్ లోకి త్వరలోనే వచ్చి వైరల్ అవుతుందని తెలుస్తుంది. మరి సినిమాలో ఈ లాకెట్ కి ఎంత కీలక పాత్ర ఉందో ఫస్ట్ అప్డేట్ లోనే దీన్ని రివీల్ చేసారు.

 

Also Read : SSMB 29 Update : మహేష్ 50వ బర్త్ డే.. SSMB29 సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి, మహేష్ బాబు.. నవంబర్ లో..