SSMB 29 Update : మహేష్ 50వ బర్త్ డే.. SSMB29 సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి, మహేష్ బాబు.. నవంబర్ లో..
నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమాపై అప్డేట్ ఇచ్చారు.

SSMB 29 Movie
SSMB 29 Update : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అడ్వెంచరస్ జానర్ లో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాపై ఎలాంటి అధికారిక అప్డేట్స్ ఇప్పటివరకు రాజమౌళి ఇవ్వలేదు. ఫ్యాన్స్ ఏమో ఈ సినిమా కోసం, సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. తన సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్ట్ చేసారు.
రాజమౌళి తన ట్వీట్ లో.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు, మహేష్ అభిమానులకు.. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. ఈ సినిమా గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే ఈ సినిమా కథ, దాని పరిధి చాలా పెద్దది. కేవలం ఫొటోలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు దానికి న్యాయం చేయలేవని నేను భావిస్తున్నాను. మేము సృష్టిస్తున్న ప్రపంచం గురించి మీకు చెప్పడానికి మేము ఒకదానిపై పనిచేస్తున్నాము. నవంబర్ 2025లో అది రిలీజ్ చేస్తాము. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉండేలా మేము ప్రయత్నిస్తున్నాము. మీ ఓపికకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపాడు.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
Also Read : Arjith : హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ తనయుడు.. అక్క ఇప్పటికే హీరోయిన్..
ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాపై అప్డేట్ ఇస్తూ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నేను కూడా మీ అందరిలాగే ఎదురుచూస్తున్నాను. నవంబర్ లో రివీల్ చేస్తామంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మహేష్ మెడలో నంది, త్రిశూలం, ఢమరుకం, మూడు నామాలు ఉన్న లాకెట్ వేసుకున్నాడు.
Thank you for all the love…❤️❤️❤️
I am eagerly waiting, as you all are, for November 2025 to enjoy the reveal with all of you. #GlobeTrotter pic.twitter.com/mCZRRB3lM1
— Mahesh Babu (@urstrulyMahesh) August 9, 2025
దీంతో నవంబర్ లో రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ సినిమా నుంచి ఏం రిలీజ్ చేయకపోయినా ఏదో ఒక అప్డేట్ ఇచ్చారులే అని సంతోషపడుతూ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో కెన్యా అడవుల్లో షూటింగ్ జరగనుంది. హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ కాశీ సెట్ వేశారు.