Sundeep Kishan : నా లవ్ స్టోరీలు అన్ని ఆమెకు తెలుసు.. నీ లాంటి ఫ్రెండ్ ఉంటే అసలు పెళ్లి జరగదు.. అందరిముందు రెజినాపై సందీప్ కామెంట్స్ వైరల్..
తాజాగా సందీప్ రెజీనా పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Sundeep Kishan
Sundeep Kishan : హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్రా మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, మా నగరం, నక్షత్రం.. ఇలా నాలుగు సినిమాల్లో నటించారు. గతంలో వీరిద్దరి మధ్య లవ్ రూమర్స్ కూడా వచ్చాయి కానీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. తాజాగా సందీప్ రెజీనా పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రెజీనా ప్రస్తుతం డ్యాన్స్ షో ఢీ లో జడ్జ్ గా చేస్తుంది. షోలో ఫ్రెండ్షిప్ థీమ్ తో చేస్తుండగా రెజీనా బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేయమంటే సందీప్ కిషన్ కి వీడియో కాల్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
Also Read : Arjith : హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ తనయుడు.. అక్క ఇప్పటికే హీరోయిన్..
రెజీనా.. బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేయమంటే నీకు కాల్ చేశాను అని అనడంతో అప్పుడప్పుడు అయినా ఇలా ఎఫెక్షన్ చూపించే చాన్సులు వస్తున్నాయి నీకు అన్నాడు సందీప్. అలాగే.. నా లవ్ స్టోరీలు ఎంత బాధాకరంగా ఉంటాయో ఆ అమ్మాయికి తెలుసు. నీ లాంటి ఫ్రెండ్ ఉంటే అసలు పెళ్లి జరగదు అని లైవ్ వీడియో కాల్ లో అందరిముందు సరదాగా అనడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో సందీప్ కిషన్ తన బ్రేకప్ లవ్ స్టోరీలు రెజినాకు తెలుసని డైరెక్ట్ గానే చెప్పేసాడు.
మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
Also Read : Mahesh Babu Birthady : మహేష్ బాబు 50వ బర్త్ డే స్పెషల్.. మహేష్ అరుదైన ఫొటోలు చూశారా?