Mahesh Babu : కమల్ హాసన్, దేవినేని అవినాష్‌కి మహేష్ బాబు థాంక్యూ ట్వీట్..

విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్. థాంక్యూ చెబుతూ మహేష్ బాబు ట్వీట్.

Mahesh Babu thankyou tweet to Kamal Haasan devineni avinash

Mahesh Babu : దివంగత నటుడు కృష్ణ మరణించి ఏడాది పూర్తి అవ్వొస్తుంది. గత ఏడాది నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాని విడిచి వెళ్లారు. ఆయన మరణించినా తెలుగు వారి మదిలో ఆయన వేసిన ముద్ర చెరిగిపోలేనిది. ఆయన అభిమానులు తమ అభిమానాన్ని అదే స్థాయిలో చూపుతూ వస్తున్నారు. సజీవంగా తమ మధ్య లేని తమ అభిమాన హీరోని శిలా రూపంలో తమతో ఉంచుకుంటున్నారు. ఈక్రమంలోనే పలు ప్రాంతాల్లో కృష్ణ విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు అభిమానులు.

ఇటీవల కృష్ణ స్వస్థలం బుర్రిపాలెం ఒక విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు తప్ప కృష్ణ కుటుంబసభ్యులంతా హాజరయ్యి సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజాగా విజయవాడ గురునానక్ కాలనీలో అభిమానులు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ చేతులు మీదుగా జరిపించారు. ఇక ఈ మోత కార్యక్రమాన్ని విజయవాడ వైసీపీ లీడర్ దేవినేని అవినాష్ దగ్గరుండి జరిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Japan Review : ‘జపాన్’ సినిమా రివ్యూ.. బంగారం దొంగగా కార్తీ మెప్పించాడా?

ఈ విగ్రహావిష్కరణ విషయంలో కృష్ణ అభిమానులు కమల్ హాసన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే కృష్ణ కుటుంబసభ్యులు కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్ బాబు కూడా రియాక్ట్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. “నాన్న (కృష్ణ) గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.