Japan Review : ‘జపాన్’ సినిమా రివ్యూ.. బంగారం దొంగగా కార్తీ మెప్పించాడా?
హీరో కార్తి(Karthi) 25వ చిత్రంగా ‘జపాన్’(Japan) సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Karthi Japan Movie Review and Rating
Japan Review : హీరో కార్తి(Karthi) 25వ చిత్రంగా ‘జపాన్’(Japan) సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో హైస్ట్ థ్రిల్లర్ గా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాని నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పారు.
కథ విషయానికి వస్తే..
ఒక పెద్ద జ్యువెల్లరీ షాప్ లో 200 కోట్ల నగలు దొంగతనం జరగడంతో జపాన్ కథ మొదలవుతుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇది ఎవరు చేశారు అని కనిపెట్టే ప్రాసెస్ లో గోల్డ్ దొంగతనాలు చేసే జపాన్(కార్తీ) కి చెందిన ఆనవాళ్లు దొరకడంతో ఈ దొంగతనం జపాన్ చేసాడని అనుకోని అతని గురించి వెతుకులాట మొదలుపెడతారు. మరోవైపు జపాన్ అంతకుముందు దొంగతనం చేసిన బంగారంతో ఎంజాయ్ చేస్తూ, సాయం చేస్తూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. జపాన్ తనని వదిలేసిన, తాను ప్రేమించిన అమ్మాయి(అను ఇమ్మాన్యుయేల్) కోసం వెళ్తే ఆ సమయానికి జపాన్ ని పోలీసులు పట్టుకోవడంతో జపాన్ దొంగతనం చేయలేదని తెలుస్తుంది. దీంతో ఆ దొంగతనం ఎవరు చేసారు? జపాన్ ని ప్రేమించిన అమ్మాయి ఎందుకు వదిలేసింది? అసలు జపాన్ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
సినిమా అంతా కార్తీ క్యారెక్టర్ చుట్టే సాగుతుంది. ఒక డిఫరెంట్ మ్యానరిజంతో కార్తీనే సినిమా అంతా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా జపాన్ క్యారెక్టర్ గురించి చెప్పడం, ఆ దొంగతనం గురించి పోలీసులు కేసు.. ఇదే సాగుతుంది. సినిమా అంతా అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా కార్తీ క్యారెక్టర్ తో కామెడీ పుట్టించడానికి ట్రై చేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు దొంగతనం ఎవరు చేశారు అని కార్తీ వెతకడం సాగుతుంది. క్లైమాక్స్ లో అసలు కార్తీ ఎందుకు దొంగతనాలు చేశాడు అనేది రివీల్ చేస్తాడు.
నటీనటుల విషయానికొస్తే.. సినిమా అంతా కార్తీ చుట్టే తిరుగుతుంది. సినిమాకి కార్తీని చాలా ప్లస్ అయ్యాడు. జపాన్ క్యారెక్టర్ లో కార్తీ ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు. ఇక అను ఇమ్మాన్యుయేల్ ఒక పాట కోసమే అన్నట్టు ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ గా సునీల్, విజయ్ ఒక నిజాయితీ పోలీసాఫీసర్ గా మెప్పిస్తారు. మిగిలిన పాత్రలు చాలావరకు తెలుగు వారికి పరిచయం లేని నటులే ఎక్కువగా ఉంటారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. నైట్ టైం జరిగే సీన్స్ ని చాలా పకడ్బందీగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ లో కార్తీని గోల్డెన్ స్టార్ జపాన్ గా రిచ్ గా చూపించడానికి ట్రై చేశారు. అను ఇమ్మాన్యుయేల్ తెరపై కాసేపే కనపడినా తనని మరింత అందంగా చూపించారు. కార్ ఛేజింగ్ సీన్ పర్ఫెక్ట్ గా తీశారు. ఇక GV ప్రకాష్ సంగీతం కొత్తగా ఉంటుంది.
మొత్తంగా ఓ దొంగ కథ.. ఎలా అంతమైంది అనే కథని కామెడీగా చెప్పడానికి ట్రై చేశారు. జపాన్ సినిమా కార్తీ కోసం ఒక్కసారి చూడొచ్చు థియేటర్లో. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..