Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా? ఇది మహేశ్ బాబు డైలాగ్. అదిప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు బాగా సూటవుతుంది.
- Naresh Mannam
- Published On : February 5, 2022 / 03:34 PM IST
Mahesh Vijay Devarakonda
Mahesh-Vijay Devarakonda: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా? ఇది మహేశ్ బాబు డైలాగ్. అదిప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు బాగా సూటవుతుంది. ఒకే ఒక్క సినిమాతో మొత్తం గ్రాఫే మారిపోయింది. హోల్ ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. మహేశ్ బాబుకే అభిమానిని అని చెప్పుకునే విజయ్ ఇప్పుడు మహేశ్ బాబు థమ్స్అప్ బ్రాండ్ కే బ్రాండ్ అంబాసిడరయ్యాడు.
Mahesh Babu: దర్శకుడికి మహేష్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం మహేశ్ బాబు వరుసగా సినిమాలు చేసే పనిలో ఉన్నారు. సినిమాలతో పాటు మౌంటెన్ డ్యూ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. గతంలో ఈ యాడ్ అఖిల్ అక్కినేని చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రమోట్ చేస్తున్న ఈ మౌంటెన్ డ్యూ బ్రాండ్ ను తెలుగులో మహేశ్ బాబు ప్రమోట్ చేస్తున్నాడు. ఈ యాడ్ కోసం మహేశ్ బాబు దాదాపు పది కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఇయర్ మహేశ్ బాబు నటించిన ఆ ప్రమోషనల్ యాడ్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది.
Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!
గతంలో మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న థమ్సప్ యాడ్ విజయ్ దేవరకొండ చేతికొచ్చింది. అర్జున్ రెడ్డితో యూత్ లో క్రేజ్ పెంచుకన్న విజయ్ దేవరకొండకు లైగర్ సినిమా లుక్ తో, పాన్ ఇండియా ఫాలోయింగ్ వచ్చేసింది. మైక్ టైసన్ లైగర్ ప్రాజెక్ట్ లోకి ఎంటరవడంతో విజయ్ దేవరకొండ పేరు నేషనల్ వైడ్ గా మార్మోగిపోతోంది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకునే క్రమంలో థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా కోకకోలా కంపెనీ అవకాశం ఇచ్చింది అంటున్నారు.
Sai Pallavi : నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తర్వాత స్పందించిన సాయి పల్లవి
చదువుకునే రోజుల్లోనే మహేశ్ బాబుకు అభిమానినని, బ్రతికితే మహేశ్ బాబులా బ్రతకాలని మహర్షి ప్రిరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ భారీ డైలాగులే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరేమో కోలా కంపెనీకి మరొకరేమో పెప్సీ కంపెనీ కి బ్రాండబసిడర్స్ గా మారి నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఎవరు బాగా చేశారని అటు మహేశ్ బాబు అభిమానులు, ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఎగ్జైయిట్మెంట్ తో కంపేర్ చేసి చూస్తున్నారు.
