Mahesh Babu : అదిరిందిగా బాబు స్టైలిష్ లుక్.. మళ్ళీ విదేశాలకు చెక్కేసిన మహేష్ బాబు..

రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేసాడు.

Image Credits : Gulte.com Twitter

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేష్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరోసారి మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ తో కనపడ్డాడు.

Also Read : Shraddha Arya : తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం ఫోటోలు వైరల్..

రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేసాడు. అయితే వెకేషన్ కా, అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనేది తెలియదు. నేడు ఉదయం మహేష్ – నమ్రత కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు. దీంతో మహేష్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి.

మహేష్ స్టైలిష్ హుడీ వేసుకొని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని గడ్డం, లాంగ్ హెయిర్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.