Shraddha Arya : తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం ఫోటోలు వైరల్..
తాజాగా శ్రద్ధ ఆర్య సీమంతం వేడుక జరిగింది.

Actress Shraddha Arya shares her Baby Shower Event Photos
Shraddha Arya : బాలీవుడ్ భామ శ్రద్ధ ఆర్య త్వరలో తల్లి కాబోతుంది. 2007లో గొడవ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధ ఆర్య తెలుగులో ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి సినిమాల్లో కనిపించింది.
తెలుగుతో పాటు హిందీ, పంజాబీ సినిమాల్లో ఈ భామ నటించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ తోను బిజీగా ఉంది.
2021లో శ్రద్ధ ఆర్య నేవి ఆఫీసర్ అయిన రాహుల్ నగల్ ని పెళ్లి చేసుకుంది. ఇటీవల కొన్ని వారాల క్రితం శ్రద్ధ ఆర్య తన ప్రగ్నెన్సీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
తాజాగా శ్రద్ధ ఆర్య సీమంతం వేడుక జరిగింది. సీమంతం వేడుక ఫోటోలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.