Guntur Kaaram : సుదర్శన్ థియేటర్ దగ్గర మహేష్ ఫ్యాన్స్ రచ్చ.. నమ్రత సైతం వీడియో షేర్..

సుదర్శన్ థియేటర్ దగ్గర మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మహేష్ సతీమణి నమ్రత సైతం వీడియో షేర్ చేసి..

Mahesh Babu wife Namrata shares Guntur Kaaram trailer release celebrations video

Guntur Kaaram : త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’.. జనవరి 12న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం ఫీవర్ కనిపిస్తుంది. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఈ మూవీ ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ థియేటర్ వద్దకి చేరుకొని సందడి చేస్తున్నారు.

అక్కడ డీజే సాంగ్స్ అండ్ డప్పులతో ఓ పండుగ వాతావరణం క్రియేట్ చేశారు. ట్రైలర్ రిలీజ్ నే సినిమా రిలీజ్ అంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కి మహేష్ సతీమణి నమ్రత సైతం ఫిదా అయ్యారు. సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్స్ కి సంబంధించిన వీడియోని నమ్రత.. తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత షేర్ చేసిన వీడియోతో పాటు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల పై ఓ లుక్ వేసేయండి.

Also read : Sandeep Vanga : బాలీవుడ్ రైటర్‌కి సందీప్ వంగ కౌంటర్.. రచయితగా మీరు రాసిందంతా అబద్దం..