Namrata Upasana : మెగా – ఘట్టమనేని క్రిస్మస్.. ఉపాసనతో నమ్రత.. చరణ్, మహేష్ ఎక్కడ?

ఇటీవల చరణ్ - మహేష్ బాబు ఓ పార్టీలో కలిసి దిగిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసనలు కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది.

Mahesh Babu Wife Namrata Shorodkar and Ram Charan Wife Upasana Christmas Celebrations Photos Goes Viral

Namrata Upasana Christmas Celebrations : మన సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఈవెంట్స్, పండగలకు కలుస్తూ ఉంటారు. ఇద్దరు హీరోలు, రెండు ఫ్యామిలీలు కలిసి సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు పెడితే అవి కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. అభిమానులు ఆ ఫొటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తారు. ఇటీవల చరణ్ – మహేష్ బాబు ఓ పార్టీలో కలిసి దిగిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మహేష్ భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసనలు కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది. నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ కావడంతో సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లల్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకొని పార్టీలు చేసుకున్నారు. దీంతో సెలబ్రిటీల క్రిస్మస్ ఫొటోలు వైరల్ గా మారాయి.

Also Read : Mega Family : మెగా కజిన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. కొత్త కోడలు కూడా జాయిన్ అయిందిగా..

నమ్రత శిరోద్కర్, ఉపాసన, మరికొంతమంది వారి ఫ్రెండ్స్ కలిసి దిగిన ఫొటోలు నమ్రత పోస్ట్ చేసింది. అలాగే నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి ఉపాసన దిగిన ఫోటో కూడా వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు మహేష్, చరణ్ ఎక్కడ అని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు.