Mega Family : మెగా కజిన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. కొత్త కోడలు కూడా జాయిన్ అయిందిగా..
తాజాగా నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ కావడంతో మెగా కజిన్స్ అంతా కలిసి నిన్న రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Mega Family Cousins Celebrate Christmas Photos goes Viral
Mega Family Christmas Celebrations : మెగా ఫ్యామిలీలో హీరోలు, నిర్మాతలు, స్టార్లు.. ఇలా చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. ఇక మెగా కజిన్స్ అందరూ ఎక్కడ ఉన్నా ఏదో ఒక పండగ టైంలో లేదా ఏదో ఒక ఫంక్షన్స్ టైంలో కలుస్తారు. కలిసి పార్టీ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మెగా కజిన్స్ అంతా కలిసి ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు.
మెగా కజిన్స్ లో రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, స్నేహ, అల్లు బాబీ, అతని వైఫ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక, వరుణ్, వైష్ణవ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా మరికొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వీరంతా కలిసి ఫొటోలు దిగి షేర్ చేస్తే మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ కావడంతో మెగా కజిన్స్ అంతా కలిసి నిన్న రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వీరంతా కలిసి ఫొటో దిగగా ఈ ఫోటోని మెగా కజిన్స్ అంతా తమ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.
Also Read : Nayan Vignesh : ఫ్యామిలీతో నయనతార క్రిస్మస్ సెలబ్రేషన్స్.. పిల్లలతో క్యూట్ ఫొటోలు చూశారా?
దీంతో మెగా కజిన్స్ క్రిస్మస్ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోలో కొత్త కోడలు కూడా చేరిపోయింది. ఇటీవల వరుణ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మెగా కజిన్స్ మొదటి మీట్ కావడంతో లావణ్య కూడా ఈ గ్యాంగ్ లో చేరిపోయింది.